పోలింగ్‌ కేంద్రం వద్ద మహిళల ఆందోళన - మద్యం, డబ్బుల పంపకాల్లో వివక్ష చూపారని నిరసన

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 6:08 PM IST

thumbnail

Clashes between people and leaders at polling station : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 142 పోలింగ్ కేంద్రం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నాయకులు మద్యం, డబ్బుల పంపిణీల్లో వివక్ష చూపారని నిరసన తెలిపారు. ఒకరికి ఇచ్చి మరొకరిని విస్మరించడంతో అగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అనంతరం వారంతా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Voters Fire on MLA at polling Station : వర్ధన్నపేటలో పోలింగ్​ కేంద్రంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, గ్రామస్థులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్​ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయలేదని స్థానికులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.