Chandrayaan Poojalu in Telangana : చంద్రయాన్​-3 సక్సెస్ కోసం.. రాష్ట్రమంతా ఆలయాల్లో పూజలు

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 3:00 PM IST

thumbnail

Chandrayaan Poojalu in Telangana : భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావాలని.. హనుమకొండలోని ములుగు రోడ్డులో ఉన్న  సప్తదామంలో 16 మంది రుత్వికుల ఆధ్వర్యంలో చండీ హోమం వైభవంగా నిర్వహించారు. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావాలని.. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం జాబిలిపై దిగనున్న ల్యాండర్‌ విక్రమ్ సాఫ్ట్‌ ల్యాండింగ్ విజయవంతమైతే తమకు ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావాలని వరంగల్ నగరంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతీయ జెండాలతో పాటు చంద్రయన్ నమూనా చిత్రాలను చేత పట్టుకొని పూజలు చేశారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందని రాకేష్ రెడ్డి తెలిపారు.  చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావాలని భారతీయులు ఆసక్తిగా చూస్తున్నారని దేశ ప్రజలు చంద్రయాన్ విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.