Pratidwani: అభయహస్తమా? కమల వికాసమా? కన్నడ ఓటరు నాడి ఎటువైపు?

By

Published : Apr 17, 2023, 9:35 PM IST

thumbnail

pratidwani: కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మే 10వ తేదీ వైపు ప్రయాణంలో చిక్కబడుతున్న పరిణామాలు ఆసక్తితో పాటు.. ఉత్కంఠనూ కలిగిస్తున్నాయి. అక్కడ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటేనే మిగిలిన దక్షిణాది రాష్ట్రాలపై దండయాత్రకు మార్గం సుగమం అనుకుంటోంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి.. ఆ గెలుపు కూడా మరొక్కరిపై ఆధారపడే స్థితిలో ఉండకూడదనే పట్టుదలతో పోరాడుతోంది కాంగ్రెస్. ఇప్పటికే కమల దళం నుంచి ప్రముఖ నాయకులు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. అయినా బీజేపీ ప్రధాన నాయకులు తామే గెలవాలనే పట్టుదలతో ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్​ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే దాహంతో హోరాహోరీగా ప్రచారం చేపడుతోంది. 

జేడీఎస్​ రాష్ట్రంలో తన బలాన్ని మరింత పెంచుకుని మిగిలిన పార్టీలకు తమ సత్తా ఏంటో చూపించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరి.. ఈ హోరాహోరీలో కన్నడ ఓటరు నాడి ఎటువైపు? అభయహస్తమా? కమల వికాసమా? మధ్యలో జేడీఎస్ ప్రభావం ఎలా ఉండబోతోంది? మోదీ - అమిత్‌ షా వ్యూహాలు పని చేస్తాయా? కర్ణాటక ఎన్నికల రూపంలో అందివచ్చిన అవకాశాన్ని రాహుల్ ఎంత మేర సద్వినియోగం చేసుకుంటారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.