నిద్ర మత్తులో డ్రైవర్.. రూ.కోటి విలువైన మద్యం బుగ్గి

By

Published : Mar 27, 2022, 5:13 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail

Liquor Laden Truck Fire: హరియాణా కర్నాల్​లో ఘోర ప్రమాదం జరిగింది. తరావడీ-శామ్​గఢ్​ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొనగా.. మంటలు చెలరేగాయి. ట్రక్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. కోటి రూపాయలకుపైగా విలువైన మద్యం పూర్తిగా కాలిపోయింది. నలాగఢ్​ నుంచి దిల్లీకి ఒక ట్రక్కులో విస్కీని తరలిస్తున్నారు. శామ్​గఢ్​ సమీపంలో మరో ట్రక్కు తొలుత డివైడర్​ను ఢీకొట్టి ఆగగా.. మద్యం లోడ్​తో వెనుకనుంచి వచ్చిన ట్రక్కు కూడా నియంత్రణ కోల్పోయి దానికి తగిలింది. అంతే ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలి బూడిదయ్యాయి. ట్రక్కు డ్రైవర్​ నిద్ర పోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.