స్టూడెంట్​ను ఢీకొని కి.మీ​ ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్​ను చితక్కొట్టిన స్థానికులు

By

Published : Jan 7, 2023, 10:04 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

దిల్లీలో ఓ యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే ఉత్తర్​ప్రదేశ్​లో అలాంటి ఘటనే జరిగింది. హర్​దోయీ జిల్లాలో సైకిల్​పై వెళ్తున్న ఓ విద్యార్థిని కారు ఢీకొట్టింది. అనంతరం కిలో మీటర్​ వరకు ఈడ్చుకెళ్లింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటపడి కారును అడ్డుకున్నారు. ఆ విద్యార్థిని రక్షించారు. కారును ధ్వంసం చేసి డ్రైవర్​కు దేహశుద్ధి చేశారు. గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.