ETV Bharat / sukhibhava

How to Make Chepala Pulusu in Telugu: చేపల పులుసు ఇలా చేశారంటే.. గిన్నె ఊడ్చాల్సిందే..!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 10:51 AM IST

How to Prepare Chepala Pulusu Recipe : "వింటే భారతం వినాలి.. తింటే గారెలు తినాలి.." అన్నది నానుడి. ఈ లిస్టులో చేపల పులుసు చేర్చాలనే డిమాండ్ కూడా ఉంది. అవును మరి.. సరిగ్గా మసాలాలు దట్టించి.. చేయి తిరిగిన వ్యక్తి వండాలేగానీ.. ప్లేట్లు కూడా నాకేస్తారంటే అతిశయోక్తి కాదు. కానీ.. చేపల కూర ఏ మాత్రం తేడాకొట్టినా ఆస్వాదించలేరు. అందుకే.. ఫిష్ వండాలంటే వెనకడుగు వేస్తారు చాలా మంది. ఇలాంటి వారికోసమే ఈ రెసిపీ. మమ్మల్ని ఫాలో అయిపోండి. లంచ్​లో చేపల పులుసు జుర్రేయండి.

Etv Bharat
Etv Bharat

Chepala Pulusu Recipe in Telugu : ఫిష్ కర్రీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది..! చేపల పులుసు పేరు చెప్పగానే మౌత్ వాటరింగ్ అయిపోతుందంటే నమ్మాల్సిందే. మీరు కూడా ఈ లిస్టులో ఉంటే.. ఈ సండే లంచ్​లోకి మెనూ కార్డ్​లో చేపల పులుసును చేర్చండి. తయారీ గురించి దిగులు చెందకండి. అద్దిరిపోయేలా.. చేపల పులుసు ఎలా తయారు చేయాలో క్లారిటీగా మేం చెప్తాం. కరెక్టుగా చేస్తే.. ప్లేట్లు నాకేస్తారంతే! మరి, ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్.. ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం..

Fish curry: లేత బెండకాయలతో చేపల పులుసు

తయారీకి కావాల్సిన పదార్థాలు:

  • చేపలు - కేజీ
  • నిమ్మరసం - అర చెక్క
  • కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • గరం మసాలా - 1 టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీస్పూన్లు
  • నూనె 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి 4 (నిలువుగా కోసినవి)
  • జీలకర్ర - 1 స్పూన్
  • చిన్న ఉల్లిపాయ (పెద్ద ముక్కలుగా కోసి ఉంచినవి)
  • చింతపండు పులుసు 40 గ్రాములు
  • ధనియాల పొడి 1 టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పౌడర్ పావు టీస్పూన్
  • మెంతుల పొడి - పావు టీ స్పూన్
  • పసుపు చిటికెడు
  • ఉప్పు సరిపడా

How to Prepare Chepala Pulusu Recipe in Telugu :

ముందుగా మసాలా పట్టించాలి..

  • చేప ముక్కలు క్లీన్ చేసిన తర్వాత.. కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి.. 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
  • ఆ తర్వాత 2సార్లు నీటితో కడగాలి. ఉప్పు, నిమ్మరసం వేసి కడిగితే నీచు వాసన రాదు.
  • ఇప్పుడు చేప ముక్కలపై కారం వేయాలి. ఘాటు ఎక్కువ తినేవాళ్లు పైన చెప్పిన దానికన్నా ఇంకాస్త వేసుకోవచ్చు.
  • తర్వాత పసుపు చిటికెడు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యాలి.
  • అనంతరం కూరకు సరిపడా ఉప్పు వెయ్యాలి.
  • ఇవన్నీ చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. అన్ని ముక్కలకూ కారం, మసాలాలు అంటుకోవాలి.
  • ఓ 5 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత.. 15 నిమిషాల నుంచి అరగంట పాటు పక్కన ఉంచాలి.

తయారీ విధానం :

  • స్టవ్ మీద కూర గిన్నె పెట్టండి. కొంచెం పెద్దదే అయితే మంచిది. ఇందులో ఆయిల్ వేయండి.
  • నూనె వేడి అయ్యాక.. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి.. బాగా వేయించండి.
  • ఇప్పుడు మసాలాలు కలిపి ఉంచిన చేప ముక్కల్ని గిన్నెలోకి వెయ్యండి.
  • స్టవ్ మీడియం ఫ్లేమ్​లో ఉండేలా చూసుకోండి. ముక్కలు సరిగ్గా కుదురుకునేలా చేసి మూత పెట్టండి.
  • 3 నిమిషాల తర్వాత మూత తియ్యండి.
  • ముక్కల్ని తిరగేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గిన్నెను స్టవ్ మీద నుంచి దించి ఎగవేత ద్వారా ముక్కల్ని తిరగేస్తే బెటర్. లేదంటే.. ముక్కలు విడిపోతాయి.
  • ఇప్పుడు మళ్లీ మూత పెట్టి 3 నిమిషాలు ఉంచండి.
  • ఆ తర్వాత మూత తీసి చింతపండు పులుసు వెయ్యాలి.
  • చింత పులుసు పోసిన తర్వాత.. ముక్కల్ని అడుగు భాగానికి చేరేలా.. వాటిని కొద్దిగా కదపండి.
  • అన్ని ముక్కలూ పులుసులో మునిగేలా చేసిన తర్వాత మూత పెట్టండి.
  • 6 లేదా 8 నిమిషాల తర్వాత ఓపెన్ చెయ్యండి.
  • ఇప్పుడు ఓ ముక్కను తీసి... ఫోర్క్ తో గుచ్చండి. ఫోర్క్ ఈజీగా దిగితే.. ముక్కలన్నీ ఉడికినట్లే. లేకపోతే మరికొన్ని నిమిషాలు ఉడికించుకోండి.
  • ఆ తర్వాత... ధనియాల పొడి వేయాలి. ఇది అస్సలు మిస్ చెయ్యవద్దు. తప్పకుండా వేయాలి.
  • కాసేపటి తర్వాత.. జీర పౌడర్, మెంతుల పొడి వేయాలి.
  • ఈ మెంతులు చాలా కీలకం. ఈ పొడి వేస్తేనే.. మీకు అద్భుతమైన టేస్ట్ వస్తుంది.
  • చివరగా కొత్తిమీర కావాలనుకుంటే.. వేయండి.
  • అంతే.. ఘుమఘుమలాడే చేపల పులుసు రెడీ.

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

నెల్లూరు చేపల పులుసు.. తిన్నారంటే అదుర్స్​!

'పల్లెటూరి చేపల పులుసు' రుచి అదుర్సు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.