ETV Bharat / sukhibhava

జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా..? అయితే ఈ పొరపాట్లు చేయకండి

author img

By

Published : Feb 17, 2023, 1:38 PM IST

నిగనిగలాడే జుట్టంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. జుట్టు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆనందంగా, మనశ్శాంతిగా ఉండొచ్చు. జుట్టు రాలకుండా, ఊడకుండా ఒత్తుగా ఉంటే మనలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

healthy-hair-growth-tips-and-tricks
జుట్టు ఆరోగ్యానికి జాగ్రత్తలు

వెంట్రుకలు రాలిపోవడం వంటివి మనల్ని ఎంతో బాధిస్తుంటాయి. ఈ సమస్యలు ఎక్కువగా చలికాలంలోనే వస్తుంటాయి. తల మీద తగినంత తేమ ఉంటేనే జుట్టుకు ఎంతో మేలని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని జుట్టు సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.

సరైన కండీషనర్లు..
జుట్టుకు వాడే కండీషనర్లు సవ్యంగా ఉండాలి. మంచి ఉత్పత్తులనే మనం ఉపయోగించాలి. వెంట్రుకలు మెత్తగా, పెళుసుబారకుండా ఉండేలా చూసుకోవాలి. చలికాలంలో బయటి వాతావరణమంతా పొడిగా ఉంటుంది. అది వెంట్రుకల్ని త్వరగా ఊడిపోయేలా చేస్తుంది. మనం వాడే కండీషనర్లన్నీ జుట్టు రాలడాన్ని అరికట్టలేవు. కానీ భవిష్యత్తులో నష్టం మరింత పెరగకుండా చేస్తాయి.

వెడల్పు దువ్వెనలు..
మనం దువ్వుకునే దువ్వెనలు కూడా బాగుండాలి. చక్కగా వెడల్పుగా ఉండే వాటిని మనం ఎంచుకోవాలి. పదునుగా ఉండేవాటిని వాడటం వల్ల శిరోజాల్ని సరైన స్థితిలో ఉంచుకోవచ్చు. సాధారణంగానే తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. వాటితో పాటు ఒత్తిడి వల్ల అవి బలహీనమవుతుంటాయి. అందుకే వెడల్పాటి దువ్వెనలే వాడటం మంచింది.

చిక్కు ముళ్ళు వీడేలా..
జుట్టును దువ్వుకునే విధానమంటుంది. మొదటి నుంచి చివరిదాకా కాకుండా.. వెంట్రుకల చివరి నుంచే కొంచెం కొంచెంగా దువ్వాలి. దీంతో మధ్యలో ఉండే చిక్కు ముళ్ళు సులువుగా వీగిపోతాయి. దువ్వటంలో కాస్తా జాగ్రత్తలు, పద్ధతులు అనుసరిస్తే ఉత్తమం. అలా కాకుండా కాసేపు మొదటినుంచి, మరికొంత సేపు చివర నుంచి దువ్వుకోవడం చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. చిక్కు విడిపోయేలా దువ్వాలే తప్ప.. గబగబా దువ్వెనను కదిలించకూడదు. అలా చేస్తే వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.

ఎక్కువ గాఢతలేని షాంపూలే వాడాలి..
మార్కెట్లో ఎన్నో షాంపూలు దొరుకుతుంటాయి. తల వెంట్రుకల రకాన్ని బట్టి అవసరమైన దాన్ని ఎంపిక చేసుకోవాలి. జిగటగా, ఎక్కడకక్కడే విడిపోయేలా ఉండే షాంపూతో ప్రయోజనం లేదు. అవసరాన్ని బట్టి తలస్నానం చేయాలి. అదేపనిగా చేసినా, ఎప్పుడో ఒకసారి తలకు పోసుకున్నా ఏం లాభం ఉండదు. నిత్యమూ తలంటుకోవాలనుకుంటే గాఢతలేని షాంపూలు వినియోగించాలి. ఏవి పడితే అవి వాడితే వెంట్రుకల కణాలు చచ్చుపడిపోయో అవకాశం ఉంది. అసలు స్నానం చేసిన ప్రతిసారీ తలకి షాంపూ వాడాలా, వద్దా అనే దానిపై శాస్త్రీయ ఆధారమేదీ లేదు. వాడుకునే షాంపూ ఏమాత్రం జుట్టుకు హాని కలిగించకూడదు. ఎక్కువ గాఢతలేని షాంపూలు వాడితే.. జట్టును కాపాడుకున్నట్లే! అంతకు మించిన ప్రత్యేక, అదనపు జాగ్రత్తలేవీ ఉండవు. కానీ కొన్ని షాంపూలు వెంటనే చికాకును కలిగిస్తాయి. అందుకే షాంపూలు వాడే ముందు అందులో కలిపే మూలపదార్థాలు ఏమిటో తెలుసుకుని వాడటం మంచింది. జిడ్డు జిడ్డుగా ఉండే షాంపూలు వాడటం మరింత మంచింది.

తలనూనె, ఇతర సంరక్షకాలు..
హెయిర్​ ఆయిల్​ను కేవలం వాటి సువాసన చూసి కొనేయ కూడదు. అందులో ఏ రసాయన పదార్థం ఉందో, మూలకం ఏమిటో ముందుగానే చూసుకోవాలి. జుట్టు పలచగా ఉందా, దట్టంగా ఉందా అనేది ప్రధానం. దాని ఆధారంగా తలనూనెల్ని, ఇతర స్ప్రేలను వాడుకోవాలి. శిరోజాల స్థితిని గమనించకుండా, ఏదిబడితే ఆ హెయిరాయిల్ వాడితే, సంరక్షణ కష్టమవుతుంది. తలకు నూనె రాసుకుని దువ్వుకుంటే మెత్తగా ఉండాలే తప్ప, గట్టిగా కాదు. సహజసిద్ధ నూనెలకే ప్రాధాన్యమివ్వాలి. కృత్రిమత్వానికే చోటిస్తే, శిరోజ ఆరోగ్యం దెబ్బతిన్నట్లే! జుట్టు సంరక్షణలో షాంపూలదే ప్రధాన పాత్ర. అలా అని అన్ని సందర్భాల్లోనూ ఒకే విధమైన షాంపూల్ని వాడొద్దంటున్నారు శిరోజ నిపుణులు. ఇవి సైతం తలస్నానం తర్వాత జట్టుకు అందమిస్తాయి. కొబ్బరి, ఆలివ్ పదార్థాలు జట్టుకు పోషణనిచ్చినిస్తాయి. రసాయనాల అసమతౌల్యం జుట్టును దెబ్బతీస్తుంది.

అనుకోకుండా జుట్టు రాలినా..
వెంట్రుకలు రాలిపోవడమనేది సహజ ప్రక్రియ. ఇది తరచుగా జరుగుతుంటోంది. తలస్నానం చేశాక పొడి టవల్​తో సరిగా తుడుచుకోకపోయినా, సవ్యంగా తల దువ్వుకోకపోయినా ఇది తప్పదు. తలస్నానం చేశాక జుట్టు దానంతట అదే ఆరాలి తప్ప.. గబగబా తుడుచుకుంటే ప్రయోజనం ఉండదు. ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకుంటేనే, శిరోజాల సంరక్షణ సాధ్యపడుతుంది. ఇవన్నీ చిన్నవే కదా అనుకోకుండా శ్రద్ధ చూపాలంటున్నారు వైద్యులు.

జుట్టు సంరక్షణకు చలికాలంలో మరిన్ని జాగ్రత్తలు

తడి జుట్టుతో బయటికి వెళ్లొద్దు
కొంతమంది తలస్నానం చేసిన వెంటనే, జట్టు ఆరకుండానే.. పనులమీద బయటకు వెళ్లిపోతుంటారు. ఇది కూడా జుట్టు త్వరగా రాలిపోవడానికి ఒక మూల కారణం. తడి తలను తుడుచుకునేందుకు సరైన హెయిర్ డ్రై సాధనాన్ని ఉపయోగించాలి. జుట్టు బాగా ఆరి, పొడిబారిన తర్వాతే ఇంటినుంచి కదలాలి. షాంపూల్ని అతిగా వాడొద్దు ఎప్పుడు తలంటుపోసుకున్నా, ముఖ్యంగా చలికాలంలో కొద్దిపాటి షాంపూ వాడితే చాలు. అలా చేయకుండా విపరీతంగా షాంపూను వినియోగిస్తే, ఆ రసాయన ప్రభావం వేరుగా ఉంటుంది. సహజసిద్ధ తైలాలు, ద్రవాలు మంచివి. చెడు ఫలితాలివ్వని రసాయనిక షాంపూలని ఎంచుకోవాలి. ఈ తేడా గ్రహించకుండా ఉంది కదా అని షాంపూనంతా వాడేస్తే, జుట్టుకు అది హానికరం.

తేమదనాన్ని కోల్పోవద్దు..
సీజన్​కు అనుగుణంగా జుట్టును కాపాడుకోవాలి. తడిబారకుండా, పొడిబారకుండా ఎప్పటికప్పుడే చూసుకుంటూ ఉండాలి. తలస్నానం చేయడానికి ముందు షాంపూను జట్టుకి రాసుకున్నట్లే.. ఆ తర్వాత సహజసిద్ధ తైలాన్ని వాడాలి. దీంతో జుట్టు రాలదు, బిరుసెక్కదు, అవసరమైన తేమదనాన్ని ఎన్నటికీ కోల్పోదు.

జుట్టును అదేపనిగా ఆరబెట్టొద్దు..
మనలో కొంతమంది ఎక్కువ విద్యుత్ వాడకంతో తడిజుట్టును ఆరబెట్టుకొంటారు. తొందరగా ఆరాలని మరీ వేగంగా, ఎక్కువగా ఆ సాధనాల్ని వినియోగిస్తారు. ఇది ఏమాత్రం సరికాదు. జుట్టు తడికావాలన్నా, పొడిగా మారాలన్నా సహజ విధానం అవసరం. అంతే తప్ప, కరెంట్ వినియోగం పెరిగిపోయేలా జుట్టును డ్రై చేసుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ హెయిర్ బ్రష్లను వాడకపోవటం మంచిది. ఎంతగానో ఉపయోగపడే హెయిర్ డ్రయ్యర్​తో జుట్టు పరిరక్షణ సులువవుతుంది. కండీషనర్ క్వాలిటీలో రాజీపడొద్దు షాంపూలు, కండీషనర్ల పట్ల ఎప్పుడూ జాగ్రత్త ఉండాల్సిందే. క్వాలిటీ ఉన్న కండీషనర్లనే వాడాలి. జుట్టును ఎంత ఎక్కువగా వేడి చేస్తే, అంత త్వరగా రాలిపోతుంది. కుదుళ్ళు బలహీనమవుతాయి. వెంట్రుకలు బాగా పొగబారి తెగిపోతుంటాయి. సరైన షాంపూతో జుట్టును కడిగిన అనంతరం సున్నిత స్పర్శతో కండీషనింగ్ చేయాలి. వీటితో రాపిడి తగ్గుతుంది. జుట్టు చిక్కుముడులు వీడిపోతాయి. డీప్ కండీషనింగ్ సాధ్యపడుతుంది. అప్పుడే ఒత్తుగా, ఎత్తుగా ఉండే జుట్టు సొంతం అవుతుందని నిపుణులంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.