కిడ్నీ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

author img

By

Published : Sep 12, 2022, 1:18 PM IST

Health Tips For hereditary kidney disease

శరీరంలోని మలినాలను బయటకు పంపించి ఆరోగ్యాన్ని కాపాడేవి మూత్రపిండాలు. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. కొందరికి వంశపారంపర్యంగా కూడా కిడ్నీ వ్యాధులు వస్తాయి. అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పరీక్షలు చేయించుకోవాలి? ఆహార నియమాలేంటి? వంటి ప్రశ్నలకు నిపుణులు సమధానాలిచ్చారు. ఓ సారి అవి తెలుసుకుందాం..

వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధులు వస్తాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Health Tips For Hereditary Kidney Diseases: మూత్రపిండాలు.. శరీరంలోని మలినాలను బయటకు పంపించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మనం తీసుకున్న ఆహారంలో ఎన్నో రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు మన శరీరంలో ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. వాటిని నియంత్రణలో ఉంచేలా కిడ్నీలు వ్యవహరిస్తాయి. అయితే కొంతమందికి వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధులు వస్తాయి. అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరీక్షలు చేయించుకోవాలో వంటి వివరాలను నిపుణులు డా. ధనుంజయ వివరించారు.

"కొంతమందికి వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధులు వస్తాయి. అందులో ముఖ్యమైనది పాలీసిస్టిక్​ కిడ్నీ వ్యాధి. సాధారణంగా ప్రతి 400 మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది. తల్లిదండ్రులకు ఈ పాలీసిస్టిక్ వ్యాధి ఉంటే పిల్లలకు కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అందుకోసం వారి కొన్ని జాగ్రత్తలు పాటించాలి."

-- డా. ధనుంజయ, ఆరోగ్య నిపుణులు

వంశపారంపర్యంగా వచ్చే కిడ్నీ వ్యాధులు.. 50-70 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ప్రభావం చూపిస్తాయని డా. ధనుంజయ తెలిపారు. కిడ్నీలు క్రమంగా చెడిపోయి.. ట్రాన్స్​ప్లాంట్​ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యంగా ప్రతీ ఏడాది కిడ్నీలకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వాటితో పాటు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని నియమాలు పాటించాలని వివరించారు. అవేంటంటే..

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..

  • ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి
  • రోజూ 8-10 లీటర్ల నీరు కచ్చితంగా తాగాలి
  • రోజూ వ్యాయామం లేదా యోగా చేయాలి
  • 45 నిమిషాల పాటు వాకింగ్​ చేయాలి
  • అప్పుడప్పుడు స్విమ్మింగ్​, సైక్లింగ్​ చేయాలి
  • జంక్​ఫుడ్​కు పూర్తిగా దూరంగా ఉండాలి
  • పండ్లు, ఆకుకూరలు తరచూ తినాలి
  • శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి

ఇవీ చదవండి: మృదువైన చర్మ సోయగానికి ఇంటి చిట్కాలు..

పక్షవాతం వస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.