ETV Bharat / sukhibhava

మీరు ఫైబర్ మంచిదని తినేస్తున్నారా? - ఈ సమస్యలు గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 12:08 PM IST

Fiber
Fiber

Fiber Side Effects : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఎంత మొత్తంలో కార్బొహైడ్రేట్స్ అవసరమో.. ఫైబర్ కూడా అంతే ముఖ్యం. కానీ, అవసరానికి మించి తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎంతమొత్తంలో ఫైబర్ తీసుకోవాలి? ఎక్కువ తీసుకుంటే కలిగే సమస్యలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..

Fiber Side Effects on Health : మీ శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఫైబర్ ఒకటి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా కొలెస్ట్రాల్‌, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అలాగే డైటీషియన్లు ఎప్పుడూ దీనిని ఎక్కువగా తినమని చెబుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఫైబర్ అధిక మొత్తంలో తీసుకుంటే హెల్త్​కు(Health) మంచిదని భావిస్తారు. కానీ, డైలీ దీనిని అవసరానికి మించి తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే. కానీ, దాని పరిమితికి మించి తీసుకుంటే మంచిది కాదు. నిపుణుల సిఫార్సు చేసిన దాని ప్రకారం.. మహిళలు రోజుకు 25 గ్రాములు, పురుషులు రోజుకు 38 గ్రాములు తీసుకోవాలి. అయినప్పటికీ, 95 శాతం మంది ప్రజలు తమ ఆహారంలో ఇంత ఫైబర్ తీసుకోవట్లేదని కొంతమంది నిపుణుల అంచనా. యాపిల్స్, బ్రోకలీ, బెర్రీలు, అవకాడోలు, పాప్‌కార్న్, తృణధాన్యాలు, ఎండిన పండ్లు, ఓట్స్, అరటిపండ్లు, క్యారెట్లు, దుంపలు, టమోటాలు వంటి ఆహార పదార్థాలలో వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

మీరు బరువు తగ్గాలని లేదా ఉన్న దానిని కొనసాగించాలనుకున్నట్లయితే.. ఏ డైటీషియనైనా మీ జీర్ణవ్యవస్థ సజావుగా జరిగేలా పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సిఫారసు చేస్తారు. కానీ, వారు సూచించిన పరిమాణం కంటే ఎక్కువ తినడం లేదా ఒక్కసారిగా ఫైబర్ తీసుకోవడం చేసినా కొన్ని అనారోగ్య సమస్యలు మీరు ఎరికోరి తెచ్చుకున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, ఆ సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..

తిన్న తర్వాత కూల్​డ్రింక్స్, సోడా తాగుతున్నారా? - అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!

గ్యాస్, ఉబ్బరం : మీ రోజువారీ ఆహారంలో ఎక్కువ ఫైబర్ తీసుకుంటున్నట్లయితే.. అది తీవ్రమైన గ్యాస్, కడుపు ఉబ్బరంతో సహా అసౌకర్య జీర్ణాశయ సమస్యలను కలిగిస్తుంది. అందుకే పోషకాహార నిపుణులు మీ డైట్​లో.. నెమ్మదిగా క్రమంగా దీని మొత్తాన్ని పెంచాలని సిఫార్సు చేస్తారు.

మలబద్ధకం : అధికంగా పీచుపదార్థాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. ఇది పేగు అడ్డంకికి దారితీస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పిని ఎదుర్కొంటున్న 63 మంది వ్యక్తులు తమ రోజువారీ డైట్​లో ఫైబర్ తీసుకునే పద్ధతి మార్చితే వారు మెరుగైన ఆరోగ్యాన్ని పొందారు.

పోషకాహార లోపం : కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటి అవసరమైన పోషకాలను ఎక్కువగా తీసుకుంటే ఏవిధంగా శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుందో.. అధిక మొత్తంలో ఫైబర్ తీసుకున్నా అలాగే పోషకాహార లోపాలను కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫైబర్ ఖనిజాలతో బంధించడం వల్ల ఇలా జరుగుతుంది.

బరువు : మీ డైట్​లో ముఖ్యంగా తగినంత నీరు తాగకుండా ఫైబర్ తీసుకోవడం భారీగా పెంచినప్పుడు.. అది ఉబ్బరం కారణంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. మీ కడుపు ఉబ్బినప్పుడు లేదా జీర్ణవ్యవస్థ మందగించినప్పుడు.. కిలోల బరువు పెరిగినట్లు అనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఫైబర్ ఎక్కువ తీసుకోవడం ద్వారా కలిగే సమస్యలకు చెక్ పెట్టండిలా..

  • ఎక్కువ మొత్తంలో నీరు తాగండి.
  • ఫైబర్ సప్లిమెంట్లను ఉపయోగిస్తున్నట్లయితే వాటిని మానేయండి.
  • అధిక ఫైబర్ ఆహారాలకు దూరంగా ఉండండి.
  • కొంత సమయం పాటు చప్పగా ఉండే ఆహారం తీసుకోండి.
  • మీ ఆహారం నుంచి ఫైబర్-ఫోర్టిఫైడ్ ఆహారాలను తొలగించండి.
  • వాకింగ్, రన్నింగ్ వంటి శారీరక కార్యకలాపాలలో పాల్గొనండి.

జనరేషన్​ గ్యాప్ గురూ - ఆరోగ్యానికి గంజి అమృతమని మీకు తెలుసా! - ఆ సమస్యలన్నీ దూరం!

నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలతో ఎన్నో లాభాలు- రొమ్ము క్యాన్సర్​కు చెక్​!- నార్మల్​ డెలివరీకి ఛాన్స్!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.