ETV Bharat / sukhibhava

ముఖంపై మచ్చలు, మొటిమలా? నిమ్మ, పెరుగు, ఆలూతో ఇలా చేస్తే...

author img

By

Published : Aug 8, 2022, 11:30 AM IST

Good skin care tips in Telugu : సాధారణంగా ఇతరుల పెళ్లిళ్లకు హాజరయ్యే క్రమంలో అందరికంటే అందంగా మెరిసిపోవాలని కోరుకునే మనం.. మన పెళ్లిలో మరింత ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా రడీ అవ్వాలనుకుంటాం. అయితే ముఖంపై ఉండే మొటిమలు, ఇతర సమస్యలు ఆ ఆశను ఆవిరి చేస్తుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

skin beauty tips in telugu
ముఖంపై మచ్చలు, మొటిమలా? నిమ్మ, పెరుగు, ఆలూతో ఇలా చేస్తే...

Skin beauty tips in Telugu :

నారింజ తొక్కలతో..
❖ orange skin benefits for face : నారింజ తొక్కలో రెటినాల్, విటమిన్ 'సి' ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. అంతేకాదు మేనిఛాయను సైతం పెంచుతాయి. దీనికోసం నారింజ తొక్కలను బరకగా తురుముకొని.. దీంతో ముఖాన్ని మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకొన్న మృతకణాలు తొలగిపోయి.. ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

❖ నారింజ తొక్కలను తీసుకొని వాటిని రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తటి పొడిగా తయారుచేసుకోవాలి. దీనిలో కొంత భాగాన్ని తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్‌స్పూన్ల నీటిలో పల్చటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేయడం ద్వారా ముఖం అందంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.

నిమ్మ..
lemon peel benefits for face : నిమ్మ కూడా ముఖంపై ఏర్పడిన నల్లటి మచ్చలను తొలగిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ 'సి' మచ్చలనే కాదు.. చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డుని కూడా తొలగిస్తుంది. ఇందుకోసం నిమ్మరసాన్ని గిన్నెలోకి తీసుకొని, దీనిలో దూది ఉండను ముంచాలి. దాంతో నల్లటి మచ్చలు ఏర్పడిన చోట మృదువుగా రుద్ది 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కాను రోజూ పాటించడం ద్వారా తక్కువ సమయంలోనే మచ్చలు తగ్గుముఖం పడతాయి.

పెరుగుతో..
❖ curd skin benefits : ముఖంపై ఏర్పడిన హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యను పెరుగుతో పోగొట్టుకోవచ్చు. పెరుగుని సమస్య ఉన్న చోట రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.

❖ పెరుగుతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్ వేసుకోవడం ద్వారా కూడా ముఖంపై ఉన్న మచ్చలను తొలగించుకోవచ్చు. దీనికోసం టేబుల్‌స్పూన్ పెరుగు, రెండు టేబుల్‌స్పూన్ల ఓట్స్, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకొని అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. అలాగే రోజ్‌వాటర్, తేనె, పెరుగు కలిపి మిశ్రమంగా చేసుకొని దాన్ని కూడా ఫేస్‌ప్యాక్‌ లాగా ఉపయోగించుకోవచ్చు.

❖ మజ్జిగతో సైతం ముఖంపై ఏర్పడిన మచ్చలను దూరం చేసుకోవచ్చు. గిన్నెలో నాలుగు చెంచాల మజ్జిగ వేయాలి. దానికి రెండు చెంచాల టొమాటో రసం కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. దాన్ని పూర్తిగా ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేయడం ద్వారా మచ్చలను తగ్గించుకోవచ్చు.

బంగాళాదుంపతో..
potato face skin : బంగాళాదుంపల్లో సహజ బ్లీచ్ లక్షణాలుంటాయి. ఇవి ముఖంపై ఉన్న నల్ల మచ్చలను చర్మం రంగులో కలిపేస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి బంగాళాదుంపను శుభ్రంగా కడిగి పొట్టు తీసి దాన్ని తురుముకోవాలి. ఆ తర్వాత దీనిపై కొద్దిగా తేనె వేసి కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటిలో ముంచిన వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారంలో మూడు రోజులు పాటిస్తే.. ముఖంపై ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి.

గంధంతో..
❖ మొటిమలు, కొన్ని రకాల చర్మ ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడిన మచ్చలను గంధం సాయంతో సులభంగా పోగొట్టచ్చు. దీనికోసం గంధపు చెక్కను రోజ్‌వాటర్‌తో అరగదీయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి వేళల్లో మచ్చలున్న చోట రాసి మరుసటి రోజు ఉదయాన్నే కడిగేస్తే సరిపోతుంది.

❖ రోజ్‌వాటర్‌లో గంధం అరగదీసి దానికి కొన్ని చుక్కల గ్లిజరిన్‌ను కలిపి మచ్చలున్న చోట అప్త్లె చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది.

దాల్చిన చెక్కతో..
దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలను పోగొడతాయి. ఇందుకోసం దాల్చిన చెక్క పొడిని తీసుకొని దానిలో కొద్దిగా రోజ్‌వాటర్, కాసిన్ని నీళ్లు కలిపి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని మచ్చలున్న చోట రాసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం ద్వారా మంచి ఫలితం పొందచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.