ETV Bharat / sukhibhava

భోజనం మానేసి పండ్లు తింటున్నారా..? అయినా బరువు తగ్గడం లేదా? ఇదే కారణం కావచ్చు!

author img

By

Published : Jan 30, 2023, 7:50 AM IST

expert-tips-for-weight-lose-and-reduce-cough-and-cold
expert-tips-for-weight-lose-and-reduce-cough-and-cold

బరువు తగ్గాలని కేవలం పండ్లు మాత్రమే తింటున్నా.. ఎటువంటి ఫలితాలు పొందనివారి కోసం ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. జలుబు, దగ్గు, నిద్రలేమి వంటి సమస్యలకు చిట్కాలకు సైతం అందిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

అన్నం మానేసి పండ్లు తిన్నా బరువు తగ్గడం లేదా? ఇదే కారణం కావచ్చు

బరువు తగ్గాలని రాత్రి పూట భోజనం మానేశారా? కేవలం పండ్లు మాత్రమే తింటున్నారా? అయినా బరువు తగ్గలేక పోతున్నారా? శరీరంలో ఎటువంటి మార్పు లేదా? ఇలాంటి ప్రశ్నలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణుల సూచన
బరువు తగ్గాలంటే శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ కాలరీలు తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అన్నం మానేసినప్పుడు పండ్లు తినడం మంచిదే అయినప్పటికి.. మనం ఎలాంటి పండ్లు తీసుకుంటున్నామనేది ముఖ్యం. అందులో కాలరీలు ఎంత స్థాయిలో ఉన్నాయో చూసుకోవాలి. అన్నంతో సమానంగా కాలరీలు ఉన్న పండ్లు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం రోజుకు 100 నుంచి 150 గ్రాముల పండ్లను తీసుకొని, మిగతా ఆహార పదార్థాలు ఆరోగ్యమైనవి తీసుకున్నప్పుడు బరువు తగ్గొచ్చు.

  • చలికాలంలో జలుబు దగ్గు వంటివి తరుచుగా వస్తుంటాయి. దీని కోసం ఆరోగ్య నిపుణులు ఓ మంచి చిట్కా చెబుతున్నారు. మనం రోజు రకరకాల పండ్లు తింటూ ఉంటాం. అయితే వాటికి ఒక్క పైనాపిల్​ను జోడించి తీసుకుంటే బలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంట్లో ఉండే బ్రోమెలైన్ న్యూట్రో సెట్రికల్​ మనకు మంచి దగ్గు మందులాగా పనిచేస్తోంది.
  • నిద్ర సరిగ్గా రాక ఇక ఇబ్బంది పడుతున్న, అందుకు మాత్రలు వాడుతున్న వారి కోసం ఆరోగ్య నిపుణుల ఓ చక్కటి టిప్​ అందిస్తున్నారు. ట్రిప్టో ఫైన్​ రిచ్​ పుడ్స్​ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. పాలు, పాల పదార్థాలు, చీజ్​, కీవీ పండ్లలో ఈ ట్రిప్టో ఫైన్​ ఎక్కువగా ఉంటాయంటున్నారు.
  • ఇవీ చదవండి:
  • బబుల్ చాయ్ తాగారా డూడుల్​ తో సెలబ్రేట్​ చేస్తున్న గూగుల్
  • చుండ్రుతో బాధపడుతున్నారా?.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.