ETV Bharat / sukhibhava

వ్యాయామానికి బ్యాక్టీరియా జోడిస్తే.. షుగర్​కు చెక్​!

author img

By

Published : Oct 23, 2020, 2:32 PM IST

Exercise and Bacteria to avoid the Diabetes: Experts
వ్యాయామానికి బ్యాక్టీరియాను జోడిస్తే.. మధుమేహానికి చెక్​!

మధుమేహం.. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం వేధించే ఓ పెద్ద సమస్య. ఇది వచ్చాక బాధపడటం కంటే.. రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు నిపుణులు.

ఒకసారి మధుమేహం వచ్చిందంటే నయం కావటం అసాధ్యం. దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి చేయగలిగిందేమీ లేదు. అందుకే జీవనశైలి మార్పులతో దీని బారినపడకుండా చూసుకోవటమే మేలన్నది నిపుణుల సూచన.

వ్యాయామం తప్పనిసరి..

జీవనశైలి మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వ్యాయామం. మధుమేహ నివారణలో ఇంతకుమంచి తేలికైన, చవకైన మార్గం మరోటి లేదు. అయితే కొందరికి ఎంత వ్యాయామం చేసినా పెద్దగా ఫలితం కనిపించదు. ఎందుకిలా? హాంకాంగ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులకు ఇలాంటి అనుమానమే వచ్చింది. ముందస్తు మధుమేహ దశలో ఉన్న కొందరిని ఎంచుకొని.. వ్యాయామానికీ పేగుల్లోని బ్యాక్టీరియా, జీవక్రియలకూ గల సంబంధం మీద అధ్యయనం చేశారు. వ్యాయామంతో గ్లూకోజు జీవక్రియలు, ఇన్సులిన్‌ స్పందనలు మెరుగుపడినవారి పేగుల్లో భిన్నమైన బ్యాక్టీరియా ఉంటున్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా కొవ్వు ఆమ్లాలను మరింత ఎక్కువగా పుట్టిస్తుండటం, అమైనో ఆమ్లాలను ఇంకాస్త అధికంగా విడగొడుతుండటం విశేషం. వీరిలో జీవక్రియలు చురుకుగా సాగుతున్నాయనటానికి ఇది నిదర్శనం.

ఇవి కూడా..

పేగుల్లోని బ్యాక్టీరియాను మార్చుకోగలిగితే వ్యాయామ ఫలితాలను వీలైనంత ఎక్కువగా పొందే వీలుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇకపై కేవలం వ్యాయామం మీదే కాకుండా.. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే పెరుగు, మజ్జిగ వంటివి క్రమం తప్పకుండా తినటంపైనా దృష్టి సారించాలని నిపుణులు తెలిపారు.

ఇదీ చదవండి: కాఫీతో లాభాలే కాదు.. నష్టాలూ ఉన్నాయండోయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.