ETV Bharat / sukhibhava

పండ్లు తింటే నిజంగానే బరువు తగ్గుతామా?

author img

By

Published : Jul 30, 2021, 6:48 PM IST

రెగ్యులర్​ డైట్​లో భాగంగా పండ్లు ఎలా తినాలి?. ఏ పండ్లు, ఏ సమయంలో తింటే.. ఆరోగ్యానికి మంచిది?. పండ్లు తింటే నిజంగానే బరువు తగ్గుతామా?. చాలా మంది మదిలో ఈ ప్రశ్నలు రేకెత్తుతాయి. మరి వీటికి సమాధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

fruits, healthy diet
పండ్లు, రుచికరమైన పండ్లు

పండ్లు తింటే నిజంగానే బరువు తగ్గుతామా? అనే సందేహం చాలా మందికే ఉంటుంది. ఆయుర్వేద మందులు, బరువు తగ్గించడంలో పండ్ల పాత్రపై అధ్యయనం చేసి కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు నిపుణులు.

పోషకాలు ఎన్నో..

ఎవరైనా పండ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకుంటేనే.. వాటి వల్ల పోషకాలు మెండుగా లభిస్తాయి. బరువు తగ్గేందుకు పండ్లు ఎంతగానో తోడ్పడుతాయని ఆయుర్వేదం చెబుతోంది.

fruits
పండ్లు తింటే ఆరోగ్యం భేష్

వృద్ధాప్య లక్షణాలను కూడా పండ్లు కొంత మేరకు దూరం చేస్తాయి. అయితే.. ఆయుర్వేదంలో తాజా పండ్ల వాడకానికి కొన్ని మార్గదర్శకాలున్నాయి. ఈ నేపథ్యంలో.. పోషకాహారాన్ని తీసుకునేముందు మనం పాటించాల్సిన కొన్ని నియమాలేంటో చూద్దాం.

లాభాలేంటి?

ఆయుర్వేదం నియమాల ప్రకారం...

  • సిట్రిక్​ ఆమ్లాలున్న పండ్లు (నిమ్మ, నారింజ) మినహా.. మిగతాపండ్లన్నీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినొచ్చు.
  • యాపిల్, అరటి, బేరీ పండు, శప్తాలు పండు(peach fruit) మొదలైనవి జీర్ణవ్యవస్థకు బలాన్ని చేకూరుస్తాయి.
  • ఆహారాన్ని సేవించే ముందు పండ్లు తింటే మంచిది.
  • వండిన ఆహారం, పండ్లు కలిపి తినకూడదు.
  • ఆహారం సేవించాక పండ్లు తినడం శ్రేయస్కారం కాదు. దీని వల్ల గాస్ట్రోఇంటెస్టినల్ ఇన్​ఫ్లమేషన్ సమస్య వచ్చే అవకాశముంది.
  • గుండె మంట మొదలైన సమస్యలూ వస్తాయి.
  • తీపిలేని(non-sweet) పండ్లు, పాల మిశ్రమం సేవించకూడదు.
  • అరటి, పాలు కలిపి తింటే.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

బరువు తగ్గాలంటే..

fruits
సరైన సమయంలో తింటేనే..

సహజంగా తీపిగా ఉండే పండ్లు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండే పండ్లు బరువు తగ్గడానికి దోహదపడతాయి. కొవ్వు పదార్థాలు కరిగేలా చేసి, ఎక్కువ బలాన్నిచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయి.

బ్లూబెర్రీస్, యాపిల్ పండ్లు, స్ట్రాబెర్రీ, బ్లాక్​బెర్రీ, బేరీ పండు, ఆల్బాకారా(prunes) మొదలైన పండ్లు తింటే మంచిది.

ఇదీ చదవండి:

జబ్బుల నుంచి రక్షణగా రుచికరమైన పండ్లు

డయాబెటిస్‌ ఉంటే.. ఈ పండ్లు తినండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.