ETV Bharat / sukhibhava

భోజనంలో ఈ మార్పులు చేయండి.. షుగర్‌ మీరు చెప్పినట్టు వినాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 2:47 PM IST

Diabetes Diet Tips
Best Diet Plan For Diabetic Patients

Best Diet Plan For Diabetic Patients : షుగర్ రోజులు ఉందని తెలిసిందంటే చాలు, చాలా మంది భయపడిపోతుంటారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని ఆలోచిస్తుంటారు. రోజువారి ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ వ్యాధిని కంట్రోల్‌ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి ఆహారం తీసుకోవడం చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.

Best Diet Plan For Diabetic Patients : గంటల తరబడి కూర్చొని పని చేయడం, వ్యాయామం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు, ఇంకా వంశపారంపర్యం.. ఇవా పలు కారణాలతో షుగర్‌ వ్యాధి మనుషుల ఒంట్లోకి ప్రవేశిస్తోంది. ఇది ఒక్కసారి వస్తే అంతే.. లైఫ్​ టైమ్​ బెర్త్ కన్ఫామ్! ఎంత అధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా.. ఈ వ్యాధిని పూర్తిగా నివారించే మందులు మాత్రం అందుబాటులో లేవు. అయితే.. ఈ వ్యాధి ఉన్న వారు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకు కూరలు..
షుగర్‌ వ్యాధి ఉన్న వారు రోజూవారి ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పాలకూరలో (Spinach) మెగ్నీషియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయని, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఆకుకూరల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినడాన్ని నివారిస్తాయని.. అందుకే వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

ఉడికించిన ఆహారం తీసుకోండి..
మనం వంట చేసే విధానం కూడా ఆహారంలోని పోషక విలువలను మారుస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే షుగర్‌ పేషెంట్‌లు వేయించిన ఆహారానికి బదులుగా, ఉడకబెట్టిన ఫుడ్స్‌ తినడానికే ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. ఆహారం వేయించడం వల్ల దానిలోని పోషక విలువలు తగ్గుతాయి, క్యాలరీలు పెరుగుతాయి. కాబట్టి, షుగర్‌ ఉన్న వారు పోషకాలు ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పండ్లు తినండి..
షుగర్‌ పేషెంట్స్‌ పండ్లు తినకూడదని అంటారు.. ఇది అపోహ మాత్రమే. షుగర్‌ను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని రకాల పండ్లను తీసుకోవచ్చు. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లను, బెర్రీస్‌, ఆపిల్స్‌, తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్‌ ఉండే జామపండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. కొంతమంది పండ్లను జ్యూస్‌లాగా చేసుకుని తాగుతారని, ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పండ్ల రసాలలో ఫైబర్ ఉండదని, జ్యూస్‌ను తయారు చేయడానికి ఎక్కువ పండ్లు అవసరమవుతాయని.. దీని వల్ల షుగర్‌ ఇన్‌టేక్ పెరుగుతుందని అంటున్నారు. అందుకే పండ్లు తినాలని సలహా ఇస్తున్నారు.

స్నాక్స్‌గా నట్స్‌..
షుగర్ పేషెంట్స్ స్నాక్ తీసుకునేటప్పుడు క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, ప్రొటీన్లు, ఫైబర్లు ఎక్కుగా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. అందుకు వీరు బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ, బీన్స్, వంటి వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

తృణధాన్యాలను తీసుకుంటే మేలు..
షుగర్ పేషెంట్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక ఆహారం.. రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో కొలుస్తుంది. అందుకే వీరు ఆహారంలో బ్రౌన్ రైస్‌, ఒట్స్, క్వినోవా, ఎర్రపప్పు వంటి వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

సీతాఫలం తింటే జలుబు చేస్తుందా? - ఆయుర్వేదం ఏం చెబుతుంది!

షుగర్​ పేషెంట్స్​ సీతాఫలం తినొచ్చా?-నిపుణుల మాటేంటి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.