ETV Bharat / state

పసిడి వెలుగుల్లో యాదాద్రి.. పరవశంలో భక్తులు

author img

By

Published : Feb 2, 2021, 8:48 AM IST

యాదాద్రి ఆలయాన్ని ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి సందర్శించారు. ప్రధానాలయంలో ఏర్పాటు చేసిన క్యూలైన్, ప్రథమ ద్వితీయ ప్రాకారాల్లో ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు.

yadadri temple architect anand sai inspected renovation works
పసిడి వెలుగుల్లో యాదాద్రి

యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి.. ప్రధానాలయంలో క్యూలెైన్ పనులు, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లోని ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుంచి తెప్పించిన సాలహారాల్లో పొందుపరిచే దేవతా మూర్తుల విగ్రహాలు బిగించే పనులు నిర్ధేశించిన సమయానికి పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శిల్పాల పనులు చివరి దశకు చేరుకున్నాయని, ప్రధానాలయం శుద్ధి పనులు చేపట్టాల్సి ఉందని ఆనంద్ తెలిపారు.

yadadri temple architect anand sai inspected renovation works
యాదాద్రికి పసిడి కాంతులు

ప్రధాన ఆలయంలో, ప్రథమ ద్వితీయ ప్రాకారాలకు బెంగళూరులోని లైటింగ్ టెక్నాలజీ కంపెనీ ప్రత్యేకంగా తయారుచేసిన పసిడి కాంతుల లైటింగ్ లను వైటీడీఏ అధికారులు బిగించి పరిశీలించారు. ఈ లైటింగ్​తో​ ఆలయం మరింత శోభను సంతరించుకోనుందని ఆనంద్ అన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా తుదిమెరుగు పనులను వైటీడీఏ అధికారులు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పరిశీలించారు. రథశాల, లిఫ్ట్​లో వైరింగ్ పనుల గురించి ఆరా తీశారు. రక్షణ గోడ వంటి నిర్మాణాలు గడువులోగా పూర్తి చేసే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

yadadri temple architect anand sai inspected renovation works
ప్రధానాలయంలో లైటింగ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.