ETV Bharat / state

తెలంగాణను సర్వనాశనం చేయాలనే ఆలోచనలో భాజపా: శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Oct 26, 2022, 5:00 PM IST

srinivas goud fires on bjp
srinivas goud fires on bjp

Srinivas Goud Fires On BJP: తెలంగాణను సర్వనాశనం చేయాలనే ఆలోచనలో భాజపా ఉందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ఆరోపించారు. అందుకే మునుగోడు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన మంత్రి.. భాజపా జిమ్మక్కుల వలలో పడొద్దని ఓటర్లను అభ్యర్థించారు.

Srinivas Goud Fires On BJP: మునుగోడు ఉపఎన్నిక ప్రచారాల పోరు వాడి వేడిగా సాగుతోంది. పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లిలో.. 5, 6వ వార్డులలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణను సర్వనాశనం చేయాలనే ఆలోచనలో భాజపా ఉందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ఆరోపించారు. కులవృత్తులను నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకే మునుగోడు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని.. మిమ్మల్ని మేల్కొలపడానికి తాను వచ్చామని తెలిపారు. అంతేకానీ వేరే ఉద్దేశం లేదని చెప్పారు. అనంతరం 6వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణతో పాటు సుమారు 100 మంది మంత్రి శ్రీనివాస్ గౌడ్​ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

"భాజపా వాళ్లు మోసం చేసి ఈ ఎలక్షన్​ను చూపించి.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణను సర్వనాశనం చేయాలి.. రాష్ట్రాన్ని అదానీ, అంబానీలకు అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నారు. కులవృత్తులను నాశనం చేయాలని చూస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. అందుకే మిమ్మల్ని మేల్కొలపడానికి మేము వచ్చాం. అంతేకాని వేరే ఉద్దేశం లేదు. మీ జీవితాలను బాగు చేయడానికి వచ్చాం. కులవృత్తులు కాపాడడానికి వచ్చాం. ఎన్నో సంవత్సరాలకు వివక్షకు గురై తాగడానికి కూడా నీరు ఇవ్వకుండా ఆగం చేసిన వారికి బుద్ధి చెప్పాలి." - మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణను సర్వనాశనం చేయాలనే ఆలోచనలో భాజపా: శ్రీనివాస్ గౌడ్

ఇవీ చదవండి: ఒక్కరిని ఓడించేందుకు.. మొత్తం అసెంబ్లీనే దిగివస్తోంది: కోమటిరెడ్డి సంకీర్త్​రెడ్డి

Munugode bypoll: మునుగోడులో హోరాహోరీగా ఎన్నికల పోరు.. ఎవరూ తగ్గట్లేదుగా!

'అమృతగాథ' పుస్తకం ఆవిష్కరించిన మోదీ.. ఈనాడుపై ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.