ETV Bharat / state

యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

author img

By

Published : Jun 30, 2020, 10:39 AM IST

Updated : Jun 30, 2020, 10:47 AM IST

యాదాద్రి ఆలయ పనులను ఆర్​అండ్​బీ అధికారులు పరిశీలించారు. ప్రధానాలయంలో జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు.

r-and-b-department-enc-ganapathi-reddy-visit-yadadri-temple
యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా

యాదాద్రి అభివృద్ధి పనులను ఆర్​అండ్​బీ శాఖ ఈఎన్​సీ గణపతిరెడ్డి, సాంకేతిక కమిటీ సభ్యులు వైటీడీఏ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ప్రధానాలయం లోపల జరుగుతున్న ఎలక్ట్రికల్​, ఏసీ, సెంట్రల్​ లైటింగ్​ పనుల పురోగతిని తెలుసుకున్నారు.

అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షానికి గర్భాలయం అద్దాల మండపంలోకి నీరు రావడం, బ్రహ్మోత్సవ మండపం వద్ద ఫ్లోరింగ్​ కుంగిపోయి పగుళ్లు ఏర్పడటం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా గర్భాలయంలోని పనులు దాదాపు పూర్తి కావస్తుండటం వల్ల ఆలయ తిరువీధుల్లో, గర్భాలయం, ముఖమండపం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లైటింగ్​ ట్రయల్​రన్​ను పరిశీలించారు. లైటింగ్​ ఎలా ఉండాలనే అంశంపై వరంగల్​కు చెందిన సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: భూ ఆక్రమణలకు చైనా క్యాబేజీ వ్యూహం..!

Last Updated : Jun 30, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.