ETV Bharat / state

Komatireddy: హామీ ఏమైంది సీఎం గారు: వెంకట్​ రెడ్డి

author img

By

Published : Jun 6, 2021, 3:31 PM IST

కరోనాను తరిమికొట్టడానికి అవసరమైతే రూ.వేల కోట్లు ఖర్చు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన హామీ ఏమైందని సీఎం కేసీఆర్​ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పర్యటించి ఉచిత అంబులెన్స్​ను ప్రారంభించారు.

Komatireddy: హామీ ఏమైంది సీఎం గారు: వెంకట్​ రెడ్డి
Komatireddy: హామీ ఏమైంది సీఎం గారు: వెంకట్​ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి పర్యటించారు. బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన 'ఉచిత అంబులెన్స్' సర్వీసును ప్రారంభించారు. స్వయంగా డ్రైవింగ్ చేశారు. అంతకుముందు పీహెచ్​సీలో హెల్త్ స్టాఫ్, ఆశావర్కర్లకు చీరలు, మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ గ్లౌజులు, పల్స్ ఆక్సీమీటర్లు, థర్మల్ స్కానర్లు అందజేశారు.

కరోనాను తరిమికొట్టడానికి అవసరమైతే రూ.వేల కోట్లు ఖర్చు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన హామీ ఏమైందని సీఎం కేసీఆర్​ను ప్రశ్నించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ అంబులెన్సులు వేలకు వేల రూపాయలు వసూల్​ చేస్తున్న నేపథ్యంలో ఉచిత అంబులెన్స్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు బీర్ల ఐలయ్యను ఎంపీ అభినందించారు.

ఇదీ చదవండి: 'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.