ETV Bharat / state

యాదాద్రి శివాలయం ఉద్ఘాటన మహోత్సవాలు.. రెండో రోజు యాగశాల ప్రవేశం

author img

By

Published : Apr 21, 2022, 5:31 PM IST

Yadadri Shivalayam Maha Kumbhabhishekam: యాదాద్రి అనుబంధ ఆలయం శివాలయలో ఉద్ఘాటన దిశగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయంలో రెండో రోజు మహాకుంభాభిషేక ఉత్సవ పూజలు నిర్వహించారు. ఈ నెల 25న మహాకుంభాభిషేకం జరగనుంది.

yadadri temple news
యాదాద్రి శివాలయంలో మహా కుంభాభిషేకం

Yadadri Shivalayam Maha Kumbhabhishekam: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన మహోత్సవం కొనసాగుతోంది. శివాలయ పునఃప్రారంభం సందర్భంగా రెండో రోజు మహాకుంభాభిషేక మహోత్సవ పూజలు కొనసాగుతున్నాయి. యాగశాల ప్రవేశం, మండపం, స్తంభ ద్వారాతోరణ పూజ, చతుస్థానార్చనలు, హోమకుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ఠ, మహారుద్ర పురశ్చరణ, మూల మంత్రానుష్టాన హవనములతో రెండో రోజు పూజలు నిర్వహించారు. సాయంత్రం శాంతి, దీక్షాహోమము, ఆగ్న్యత్తారణము, కౌతుక బంధనము, జలాధివాసము జరపనున్నారు.

yadadri temple news
యాదాద్రి శివాలయంలో మహా కుంభాభిషేకం పూజలు

ఆలయ మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 25న నిర్వహించనున్నారు. నిన్న, నేడు ఆలయ అంకురార్పణ, యాగశాల ప్రవేశం జరగ్గా.. 23న మహాలింగార్చనం, ధాన్యాధివాసం, 24న శతరుద్రాభిషేకం, పుష్పాధివాసం నిర్వహిస్తున్నారు. 25న (సోమవారం) ఉదయం 10.25 గంటలకు ధనిష్ఠా నక్షత్ర యుక్త మిధున లగ్న పుష్కరాంశ సముహూర్తమున మహాకుంభాభిషేక మహోత్సవం ఉంటుంది. స్మార్త ఆగమ సంప్రదాయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే రోజు సాయంత్రం నుంచి దైవదర్శనాలు మొదలవుతాయి.

ఇవీ చదవండి: స్కందగిరి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ.. హాజరైన గవర్నర్‌, మంత్రి తలసాని

ఆస్పత్రికి పవర్​ కట్.. సెల్​ఫోన్​ ​లైట్​ వెలుగులోనే ప్రసవం.. లక్కీగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.