ETV Bharat / state

Fit india foundation: 'అన్​లాక్ సమయంలో స్వీయ రక్షణే శ్రీ రామరక్ష'

author img

By

Published : Jun 27, 2021, 8:07 PM IST

thalari ganesh, fit india foundation
తలారి గణేష్​, ఫిట్​ ఇండియా ఫౌండేషన్​

యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెం గ్రామంలో ఫిట్​ ఇండియా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహమ్మారి సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్తత్తలు తీసుకోవాలని ఫౌండేషన్​.. జిల్లా ఉపాధ్యక్షుడు తలారి గణేష్​ సూచించారు.

డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కలలుగన్న ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఫిట్​ ఇండియా ఫౌండేషన్​ పనిచేస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు తలారి గణేష్​ పేర్కొన్నారు. జిల్లాలోని రామన్నపేట మండలం సర్నేనిగూడెంలో కరోనా మహమ్మారి పట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని.. చేతులు శానిటైజ్​ చేసుకోవాలని తలారి గణేష్ సూచించారు.

సర్నేనిగూడెంలో కొవిడ్ వల్ల ఆరుగురు మరణించడం ఎంతో బాధాకరమని​ విచారం వ్యక్తం చేశారు. కరోనా అన్​లాక్ సమయంలో స్వీయ రక్షణే శ్రీరామరక్ష అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్​ సభ్యులు జినుక గోవర్దన్​, గూని నరేందర్, కాకి కిరణ్, సర్పంచ్ ధర్నే రాణి, ఉపసర్పంచ్ శోభన్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Komati Reddy: టీపీసీసీ.. టీటీడీపీగా మారబోతోంది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.