ETV Bharat / state

MP Komatireddy tweet: దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధాకరం: ఎంపీ కోమటిరెడ్డి

author img

By

Published : Mar 28, 2022, 12:29 PM IST

Komatireddy tweet: యాదాద్రి పునఃప్రారంభానికి తనకు ఆహ్వానం అందలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. సీఎంవో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేయడం దుర్మార్గమని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

Komatireddy tweet:
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

Komatireddy tweet: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంవో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి తనను పిలవలేదని మండిపడ్డారు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించారని ట్విట్టర్​లో వెల్లడించారు. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేయడం చాలా బాధాకరమని ఎంపీ కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

  • #yadadritemple

    యాదాద్రి పునఃప్రారంభానికి @TelanganaCMO ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పునః ప్రారంభానికి పిలవలేదు.

    కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను మాత్రం ఆహ్వానించింది.

    దేవుడు దగ్గర కేసిఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం.

    — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలోనూ పలుసార్లు ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆరోపించారు. తన నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధినైనా.. ప్రోటోకాల్ ప్రకారం పిలవడం లేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి మండిపడ్డారు. యాదాద్రి పునఃప్రారంభోత్సవానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలవకపోవడంపై కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే వదులుకున్నకోమటిరెడ్డిని పిలవకపోవడం దారుణమని కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్‌ పాటించకుండా రాజకీయాలు చేయడం ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.