ETV Bharat / state

పోలీస్​ దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న ఆలేరు కళాశాల

author img

By

Published : Nov 4, 2020, 10:09 PM IST

పోలీస్​ దేహదారుఢ్య పరీక్షలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం.. ఆలేరు మున్సిపల్​ ఛైర్మన్​, మున్సిపల్​ కమిషనర్​ సహకారంలో కళాశాల మైదానాన్ని చదును చేయించారు.

aleru junior college ground cleaned in yadadri district for polie fitness tests
పోలీస్​ దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న ఆలేరు కళాశాల

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్​ శిక్షణ కేంద్రంలో దేహదారుఢ్య పరీక్షల కోసం సిద్ధం చేస్తున్నారు. ఆలేరు మున్సిపల్​ ఛైర్మన్​ శంకరయ్య, మున్సిపల్​ కమిషనర్​ నాగేంద్రబాబు సహకారంతో కళాశాల మైదానాన్ని చదును చేసే పనులను చేపట్టారు.

ఆలేరు కళాశాలలో పోలీస్​ శిక్షణ కేంద్రం రావడాన్ని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రత్యేక చొరవ తీసుకున్నారని కళాశాల ఇన్​ఛార్జ్​ ప్రిన్సిపల్​ రాజన్న తెలిపారు. ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో చదవిన 18 నుంచి 33 ఏళ్ల విద్యార్థినీవిద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.