ETV Bharat / state

alaru wife protest: కలిసుంటానని నమ్మించి.. పెళ్లి చేసుకుని.. తీరా పాప పుట్టాక..

author img

By

Published : Apr 26, 2023, 5:19 PM IST

wife protest against to her husaband in alair
కలిసుంటానని నమ్మించి.. పెళ్లి చేసుకుని.. తీరా పాప పుట్టాక ఇలా..

wife protest against to her husaband in alaru: ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకుని తీరా పాప జన్మించాక తల్లి బిడ్డను వదిలేసి వెళ్లాడు. ఎన్నిసార్లు అతడిని సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందించకుండా ఇష్టారీతిన మాటలు అనడంతో చేసేదేమిలేక ఆ వ్యక్తి ఇంటి ముందు చంటి బిడ్డతో పెట్రోల్ డబ్బా పట్టుకొని తల్లి నిరసన దీక్షకు దిగింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు వదిలేసాడు అనే విషయాలు మీకోసం.

wife protest against to her husaband in aleru: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని రామ్ శివాజీ నగర్​కు చెందిన భార్గవిని తన ఇంటి పక్కనే ఉండే మణికంఠ ప్రేమించానని వెంటపడ్డాడు. నువ్వు లేకపోతే చనిపోతానని అమ్మాయిని భయపెట్టి లొంగతీసుకున్నాడు. రెండేళ్లు సహజీవనం చేసిన తర్వాత మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని వదిలిపెట్టాడు. వేరే గత్యంతరం లేక ఆ అమ్మాయి తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లికి సిద్ధమైంది. తీరా వివాహానికి రెండు రోజులు ఉందనగా అమ్మాయి వద్దకు వెళ్లి నువ్వు నాతో సహజీవనం చేసిన ఫోటోలు, వీడియోలు అన్ని ఉన్నాయి. నీవు నన్ను పెళ్లి చేసుకోకపోతే అవన్నీ బయట పెడతానని బెదిరించాడు. భార్గవి కన్న వాళ్లు చూసిన పెళ్లిని కాదని ఇంట్లో వాళ్లను ఎదిరించి ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయింది. ఇద్దరు పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టారు. కొన్ని నెలలు వాళ్ల కాపురం సాఫీగా సాగింది.

ప్రెగ్నెన్సీతో మొదలైన సమస్య: ఇంతవరకు బాగానే ఉంది.. అయితే భార్గవికి ప్రెగ్నెన్సీ రావడంతో వద్దని అబార్షన్ చేసుకోమని పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడు మణికంఠ. భార్గవి ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఆమెను వారి తల్లిదండ్రుల ఇంటి వద్ద వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లాడు. భార్గవి డెలివరీ అయ్యి పాపకు జన్మనిచ్చింది. హైదరాబాద్ వెళ్లిన మణికంఠ 15 నెలలు గడుస్తున్నా ఇంటికి రాలేదు. కనీసం పాప పుట్టినప్పుడు కూడా చూడ్డానికి రాలేదని పలుమార్లు ఫోన్లో సంప్రదించగా.. అసభ్యకరంగా మాట్లాడి నీవు నాకు అవసరం లేదు, నీ కూతురు నాకు అవసరం లేదని.. ఏం చేసుకుంటావో చేసుకో.. నీకు నాకు సంబంధం లేదని చెప్తున్నాడని భార్గవి బోరున విలపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ చంటి బిడ్డతో పెట్రోల్ క్యాన్ పట్టుకొని మహిళ సంఘాల ఆధ్వర్యంలో మణికంఠ ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలని న్యాయం జరగకుంటే కూతురుతో కలిసి అబ్బాయి మణికంఠ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది.

పోలీసుల వివరణ..ఈ విషయంపై స్థానిక ఆలేరు ఎస్సై ఇద్రిస్ అలీని వివరణ కోరగా.. గతంలో మణికంఠకు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా తన ప్రవర్తన మార్చుకోవడం లేదని, ఉమెన్స్ పోలీస్ స్టేషన్​కు పిలిచినా రావటం లేదని మరోసారి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.

"మేము రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నాము. మా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకుండా వేరే పెళ్లి కుదిర్చారు. అయితే ఐదు మంది రౌడీలను తీసుకొచ్చి నన్ను తీసుకెళ్లిపోయాడు. పోలీస్ స్టేషన్​లో మా పెళ్లి జరిగింది. మాకు పాప పుట్టింది. సంవత్సరం నుంచి పాపను తీసుకెళ్తా అంటున్నాడు కానీ నన్ను వద్దంటున్నాడు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి లేకపోతే మేము చనిపోతాము."_భార్గవి, బాధితురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.