ETV Bharat / state

తాగి గొడవ చేస్తున్నాడని భర్తను నరికి చంపిన భార్య

author img

By

Published : Dec 12, 2019, 11:23 PM IST

భార్యాభర్తల గొడవ హత్యకు దారి తీసింది. మద్యానికి బానిసై... రోజూ ఘర్షణ పడుతున్న భర్తను తట్టుకోలేని ఓ భార్య తీవ్ర కోపోద్రిక్తురాలైంది. గొడ్డలితో నరికి భర్తను హతమార్చిన ఘటన వంరగల్​ అర్బన్​ జిల్లా శంభునిపేటలో జరిగింది.

WIFE MURDERED HIS HUSBAND FOR DAILY DRINKING
WIFE MURDERED HIS HUSBAND FOR DAILY DRINKING

వరంగల్ అర్బన్ జిల్లా శంభునిపేటలో దారుణం జరిగింది. రాజు అనే కూలిని భార్య గొడ్డలితో నరికి చంపింది. మద్యానికి బానిసైన రాజు... రోజూ భార్యతో గొడవ పడేవాడు. రోజూలాగే మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజు... భార్యతో ఘర్షణకు దిగాడు. సహనం కోల్పోయిన భార్య... పక్కనే ఉన్న గొడ్డలితో భర్తపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రాజు... అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

భర్త తాగి గొడవ చేస్తున్నాడని భార్య నరికి చంపింది...

ఇవీచూడండి: వేధిస్తున్నాడని భర్తని చంపిన భార్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.