ETV Bharat / state

గ్రామాభివృద్ధికి అప్పులు చేసిన సర్పంచ్.. బిల్లులు రాక ఉపాధి హామీ పనికి

author img

By

Published : May 25, 2022, 2:55 PM IST

sarpanch went to mgnrega works
అప్పులు కట్టలేక ఉపాధి హామీ పనికి సర్పంచ్

MGNREGA Sarpanch: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాభివృద్ధికి కృషి చేశారు ఆ సర్పంచ్. చేతిలో రూపాయి లేకపోయినా అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. బిల్లులు వస్తే తీర్చుదామన్న ఆశతో ఉన్నారు. ఎన్నిరోజులైనా రాకపోయేసరికి పుస్తెల తాడు అమ్మి కొన్ని అప్పులు తీర్చారు. ఇక ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో గత్యంతరం లేక ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఓ సర్పంచ్​ పరిస్థితి ఇది.

MGNREGA Sarpanch: గ్రామాభివృద్ధి పనులకు చేసిన అప్పులు తీర్చలేక ఓ సర్పంచ్​ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో దంపతులిద్దరూ కూలీలుగా మారారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్త గ్రామపంచాయతీ విశ్వనాధకాలనీకి సర్పంచ్​గా వల్లెపు అనిత ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, పల్లె ప్రగతి పనులకు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. పనులు సకాలంలో పూర్తి చేసినా బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కాస్త పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని సర్పంచ్ అనిత వాపోయారు. అందుకే ప్రతిరోజూ ఉపాధి హామీ పనికి భర్తతో కలిసి వెళుతున్నట్లు తెలిపారు.

అప్పులు కట్టలేక ఉపాధి హామీ పనికి సర్పంచ్

ఇప్పటివరకూ చేపట్టిన పనులకు సంబంధించి రూ. 8 లక్షల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని సర్పంచ్​ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి నెలకు వచ్చే రూ. 40 వేల నిధులను సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బిల్లులు, ట్రాలీ ఈఎంఐ, డీజిల్ ఖర్చులకూ సరిపోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పెండింగ్ బిల్లులు ఇప్పించాలని సర్పంచ్ అనిత కోరుతున్నారు.

"పల్లె ప్రకృతి, వైకుంఠధామం, వీధిలైట్లు ఇలా గ్రామంలో చాలా చోట్ల అభివృద్ధికి అప్పులు చేశాం. అభివృద్ధి లేకపోతే సస్పెండ్ చేస్తారేమోనన్న భయంతో అన్ని పనులూ చేస్తున్నాం. కానీ ఇంతవరకూ వాటికి సంబంధించిన నిధులు రాలేదు. పూట గడవడం కష్టంగా మారింది. అప్పులు తీర్చడం కోసం చివరకు నా పుస్తెల తాడు సైతం అమ్మేశాను. అధికారులు ఇప్పటికైనా బిల్లులు అందేలా చూడాలి." -అనిత, విశ్వనాథ కాలనీ సర్పంచ్​

ఇవీ చదవండి: ఇలా చేస్తే.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ ఈజీగా గట్టెక్కొచ్చు

దేశంలో కొత్తగా 2వేలకుపైగా కరోనా కేసులు.. తగ్గిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.