భాజపాను గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుందన్న కిషన్​రెడ్డి

author img

By

Published : Aug 27, 2022, 6:38 PM IST

Updated : Aug 27, 2022, 7:07 PM IST

ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే అభివృద్ధి సాధ్యమన్న కిషన్​రెడ్డి

kishan reddy speech in hanamkonda sabha తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. భాజపాను గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు. హనుమకొండలోని బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

భాజపాను గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుందన్న కిషన్​రెడ్డి

kishan reddy speech in hanamkonda sabha: మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందని తెలిపారు. రహదారుల కోసం మొత్తం రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్న ఆయన.. యాదాద్రి నుంచి వరంగల్‌కు రూ.388 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించిందని గుర్తు చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్​ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్​రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా వరంగల్‌ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.196 కోట్లు ఇచ్చిందని కిషన్​రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా మరో రూ.196 కోట్లను కేసీఆర్‌ ఇవ్వలేదని ఆరోపించారు. వరంగల్‌లో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ధి చేస్తానని గతంలో పేర్కొన్న కేసీఆర్‌.. ఫామ్‌హౌజ్‌ను వీడింది లేదు, వరంగల్‌లో అభివృద్ధి చేసింది లేదని దుయ్యబట్టారు. వరంగల్‌ జిల్లాలోని ఆలయాలనూ కేసీఆర్‌ పట్టించుకోలేదని మండిపడ్డారు. కూలిపోయే దశలో ఉన్న కాకతీయుల కళా మండపాన్ని పట్టించుకోలేదన్న కిషన్​రెడ్డి.. ఆ మండపాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆధునీకరిస్తోందని తెలిపారు.

భాజపాను గెలిపిస్తే మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుంది..: వరంగల్‌ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సైనిక్‌ స్కూల్‌ను మంజూరు చేసిందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. సైనిక్‌ స్కూల్‌ నిర్మాణం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం భూమి కేటాయించటం లేదని ఆరోపించారు. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భాజపా అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కిషన్‌రెడ్డి.. భాజపాను గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుందని స్పష్టం చేశారు.

మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తోంది. వరంగల్‌లో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ధి చేస్తానని కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ను వీడింది లేదు, వరంగల్‌లో అభివృద్ధి చేసింది లేదు. వరంగల్‌ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.196 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా మరో రూ.196 కోట్లను కేసీఆర్‌ ఇవ్వలేదు. వరంగల్‌ జిల్లాలోని ఆలయాలను కేసీఆర్‌ పట్టించుకోలేదు. కూలిపోయే దశలో ఉన్న కాకతీయుల కళామండపాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆధునీకరిస్తోంది. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. భాజపా అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. భాజపాను గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుంది. - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్దం..: కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. అమృత్ పథకంలో నిధులు కేటాయిస్తే ఖర్చు పెట్టకుండా దారి మళ్లించారని ఆరోపించారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ తెలంగాణకు కేటాయించిన నిధులపై చర్చకు సిద్ధమని కిషన్​రెడ్డి సవాల్​ విసిరారు. కేసీఆర్ వరంగల్ నగరానికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఈ తెరాస ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి.. కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్​హౌస్​కే పరిమితం చేయాలన్నారు.

ఇవీ చూడండి..

JP Nadda Fire on CM KCR కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యమన్న జేపీ నడ్డా

వరంగల్​ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా

రసవత్తరంగా ఝార్ఖండ్​ రాజకీయం, క్యాంపులకు ఎమ్మెల్యేల తరలింపు

Last Updated :Aug 27, 2022, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.