National athletic championship: రసవత్తరంగా జాతీయ అథ్లెటిక్ పోటీలు

author img

By

Published : Sep 19, 2021, 12:22 PM IST

national level athletics competition

అథ్లెటిక్స్‌ జాతీయ స్థాయి పోటీలు నాలుగో రోజు రసవత్తరంగా సాగాయి. క్రీడాకారులు నువ్వా.. నేనా అన్నట్లు తలపడ్డారు. పురుషులు, మహిళల విభాగంలో ఐదేసి ఈవెంట్లలో పోటీలు జరిగాయి. ప్రముఖులు ప్రేక్షకుల మధ్య కూర్చొని ఆటలను వీక్షించారు. చిన్నారులు చప్పట్లతో క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

హనుమకొండ జిల్లాలోని జేఎన్ఎస్ మైదానంలో జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలు (national level athletics competition) ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. క్రీడకారులు నువ్వా... నేనా అన్నట్లు తలపడుతున్నారు. అయితే ఈ క్రీడ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన క్రీడకారులు పోటీలలో పాల్గొని పతకాలను సాధిస్తున్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ తమ సత్తాను చూపెడుతూ ప్రతిభను చాటుకుంటున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పారుల్‌ చౌదరి రెండు బంగారు పతకాలు అందుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ మీరట్‌కు చెందిన పారుల్‌ చౌదరి 5000, 3000 మీటర్ల పరుగులో విజేతగా నిలిచారు. ఆమె తండ్రి రిషిపాల్‌ ఒక రైతు. ‘రోజూ అథ్లెటిక్స్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు 20 కిలోమీటర్ల దూరం వెళ్లాను. మా ప్రాంతంలో ఓ అమ్మాయి ఆటలు ఆడేందుకు ఎన్నో ఇబ్బందులు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ రైల్వేస్‌ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్నాను.’ అని పారుల్‌ చౌదరి చెప్పారు.

రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌కు చెందిన సొనల్‌ సుక్వాల్‌ వ్యవసాయ కుటుంబానికి చెందిన అథ్లెట్‌. 20 కి.మీ రేస్‌ వాక్‌లో బంగారు, 35 కి.మీ రేస్‌వాక్‌లో రజత పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే తండ్రి కలని సాకారం చేస్తానని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో పతకం గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.లక్ష నగదు ప్రోత్సాహం అందుతుందని, దాని కోసం రెండు ఈవెంట్లు చేసినట్లు అథ్లెట్‌ తెలిపారు. పేదరికం తన విజయాన్ని అపదని, సాధనకు, ఇతర అవసరాలకు ఆ నగదు కొంత ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇదీ చూడండి: Raja Rithvik Chess: తెలంగాణ కుర్రాడికి గ్రాండ్​మాస్టర్​ హోదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.