ETV Bharat / state

'సామాజిక దూరానికై మార్కెట్ మార్చేస్తున్నాం'

author img

By

Published : Mar 28, 2020, 10:41 AM IST

కూరగాయల మార్కెట్ రద్దీని దృష్టిలో పెట్టుకుని సామాజిక దూరం పాటించేందుకు వీలుగా అధికారులు యార్డును అజంజాహీ మిల్లు గ్రౌండును ఎంపిక చేశారు.

lakshimipuram market yard shift due to corona virus at warangal
'సామాజిక దూరానికై మార్కెట్ మార్చేస్తున్నాం'

వరంగల్​లోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ యార్డులో రద్దీ పెరగకుండా... అధికారులు మార్కెట్​ను అజంజాహీ మిల్లు గ్రౌండ్​కు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్​కు వచ్చేవారు సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఈ మైదానం ఉంటుందని వరంగల్ తూర్పు శాసనసభ్యులు నరేందర్ పేర్కొన్నారు.

'సామాజిక దూరానికై మార్కెట్ మార్చేస్తున్నాం'

మార్కెట్ యార్డును రేపటి నుంచే మైదానంలోకి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వ్యాపారస్తులకు ఇప్పటికే సూచించినట్లు పేర్కొన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ మిశ్రమాన్ని మార్కెట్ ఆవరణలో పిచికారీ చేశారు.

ఇవీ చూడండి: పల్లెటూళ్లకు సత్వర న్యాయం.. గ్రామ న్యాయాలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.