ETV Bharat / state

'అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి'

author img

By

Published : Nov 17, 2020, 3:07 PM IST

ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు.. మరోవైపు సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్​విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్​లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Government Chief Whip Dassam Vinay Bhaskar
ప్రభుత్వ చీఫ్​విప్ దాస్యం వినయ్ భాస్కర్

పేదింటి ఆడబిడ్డ పెళ్లి సమయంలో తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్​లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 33మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు.. మరోవైపు సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.