ETV Bharat / state

జీడబ్ల్యూఎంసీలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు విత్​డ్రా

author img

By

Published : Apr 22, 2021, 5:47 PM IST

Telangana municipal election
Warangal urban

వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో భాగంగా హన్మకొండలో నామినేషన్ విత్​డ్రాలు ముగిశాయి. చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామపత్రాలు ఉపసంహరించుకున్నారు.

వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల సందర్భంగా పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామపత్రాల విత్​డ్రాకు నేడే చివరిరోజు కావడం వల్ల పార్టీ నేతల బుజ్జిగింపులతో కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు విత్​డ్రా చేసుకున్నారు.

చివరి నిమిషంలో వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి... తమ పార్టీ కార్పొరేటర్లకు బీఫాంలు అందజేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.