ETV Bharat / state

ఆన్​లైన్ తరగతుల పేరుతో వేధింపులు  సరికాదు: ఏబీవీపీ

author img

By

Published : Jun 27, 2020, 5:15 PM IST

A New Way to Private Educational Institutions Income to Online Classes said by ABVP leaders in Warangal district
ప్రైవేటు విద్యాసంస్థల ఆదాయానికి నూతన మార్గం... ఆన్​లైన్​ తరగతులు : ఏబీవీపీ

విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలంటూ వరంగల్ నగరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆన్​లైన్ తరగతుల ద్వారా చిన్నారుల కంటి చూపు మందగిస్తుందని... ఈ​ సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... వరంగల్ నగరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్... జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.

లాక్​డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను... విద్యాసంస్థలు ఫోన్ల ద్వారా ఫీజుల పేరిట భయాందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఆన్​లైన్ తరగతుల ద్వారా చిన్నారుల కంటి చూపు మందగిస్తుందని వివరించారు. ఈ ఆన్​లైన్​ తరగతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో... రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి : మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.