ERRABELLI: సొంత స్థలాలు ఉంటే.. ఈ ఏడాది నుంచే ఇళ్లు కట్టిస్తాం

author img

By

Published : Aug 12, 2021, 2:17 PM IST

minister errabelli dayakar rao

సొంత స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వం ఇళ్లు కట్టించే ప్రక్రియ ఈ ఏడాది నుంచే అమలు కానుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు వెల్లడించారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను అభివృద్ధి చేసిన ఏకైక ప్రభుత్వం తెరాసదేనని స్పష్టం చేశారు.

ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (minister errabelli dayakar rao) వెల్లడించారు. ఈ ఏడాది నుంచే సొంత స్థలాలున్న వారికి రెండు పడకగదుల ఇళ్లు కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 135 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు.

కరోనా కష్టకాలంలోనూ తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇంతకు ముందు వరకు ప్రభుత్వమే స్థలాల్లో ఇళ్లుకట్టి ఇచ్చేది. ఈ సంవత్సరం నుంచి... సొంత స్థలం ఉంటే.. వారికి రెండు పడకగదుల ఇళ్లు కట్టిస్తాము. రెండేళ్లుగా కొన్ని కారణాలతో చాలా చోట్ల పెన్షన్లు ఇవ్వట్లేదు. ఈ నెల ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తాము.

-ఎర్రబెల్లి దయాకర్​ రావు, మంత్రి (minister errabelli dayakar rao)

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు

కరోనా సమయంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు పరుస్తుందని మంత్రి తెలిపారు. రానున్న రెండేళ్లలో భూమి లేని దళితులకు పది లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేస్తున్న కేసీఆర్​ను మనమే అధికారంలోకి తెచ్చుకోవాలని ఎర్రబెల్లి సూచించారు.

ఇదీ చూడండి: Talasani: ఈటల రాజేందర్​ హుజూరాబాద్​లో బీసీ.. శామీర్​పేటలో ఓసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.