ETV Bharat / state

'మా భూమిలో వద్దు.. ప్రభుత్వ భూమిలో పెట్టుకోండి'

author img

By

Published : Jan 26, 2021, 12:30 PM IST

తన సొంత భూమిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని... నిరసనకు దిగారు ఓ రైతు. వెంటనే దానిని ప్రభుత్వ భూమిలో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ.. పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు.

warangal
'మా భూమిలో వద్దు.. ప్రభుత్వ భూమిలో పెట్టుకోండి'

తమ సొంత భూమిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఓ రైతు కుటుంబం నిరసనకు దిగింది. ఈ విగ్రహాన్ని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. కుటుంబ సభ్యులతో కలిసి పురుగుమందు డబ్బాలను పట్టుకుని ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని రేలకుంటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలిలా...

కూచనబాబు అనే రైతు.. తనకు చెందిన పట్టా భూమిలో కొందరు గ్రామస్థులు అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తమకు అంబేడ్కర్​పై గౌరవం ఉంది కానీ.. తమ పట్టా భూమిలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని రైతు.. తన కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.