ETV Bharat / state

దసరా నాటికి కలెక్టరేట్​ నిర్మాణం పూర్తి చేయాలి: యాస్మిన్ భాషా

author img

By

Published : Aug 19, 2020, 4:17 PM IST

wanaparthy collector reviewed at collectorate
దసరా నాటికి కలెక్టరేట్​ నిర్మాణం పూర్తి చేయాలి: యాస్మిన్ భాషా

విజయదశమి నాటికి నూతన కలెక్టర్​ కార్యాలయం పనులు పూర్తవ్వాలని వనపర్తి కలెక్టర్ యాస్మినన భాషా పరిశీలించారు. నిర్మాణం పనుల్లో విద్యుదీకరణ, టైల్స్​ తదితర పనులు ఇంకా మిగిలి ఉన్నాయని వాటిని వెంటనే పూర్తిచేసి విజయదశమి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

నూతన కలెక్టర్​ కార్యాలయం నిర్మాణ పనులను వనపర్తి జిల్లా కలెక్టర్​ యాస్మిన్​ భాషా పరిశీలించారు. విజయదశమి నాటికి పనులన్నీ పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధంగా తయారుచేయాలని కలెక్టర్​ సూచించారు. నిర్మాణం పనుల్లో విద్యుదీకరణ, టైల్స్​ తదితర పనులు ఇంకా మిగిలి ఉన్నాయని వాటిని వెంటనే పూర్తిచేసి విజయదశమి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.

నూతన కలెక్టరేట్​తో పాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలోని అన్ని బ్లాక్​లను పరిశీలించి టైల్స్​ పనులు, విద్యుదీకరణ పనులను వేగవంతం చేయాలని తుది దశలో ఉన్న అన్ని పనులపై దృష్టి సారించి తొందరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.