ETV Bharat / state

ఎంపీపీ దాతృత్వం... సొంత డబ్బులతో అంబులెన్స్ వితరణ

author img

By

Published : Dec 22, 2020, 6:42 PM IST

సొంత ఖర్చులతో అంబులెన్స్​ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు వనపర్తి జిల్లా చిన్నంబాయి ఎంపీపీ సోమేశ్వరమ్మ. నూతన వాహనాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి ప్రారంభించారు.

MPP provided ambulance at own expense in wanaparthy district
సొంత ఖర్చులతో అంబులెన్స్ అందించిన ఎంపీపీ

ప్రజల ఇబ్బందులు చూడలేకే సొంత ఖర్చులతో అంబులెన్స్​ను కొనుగోలు చేశానని ఎంపీపీ సోమేశ్వరమ్మ తెలిపారు. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండల కేంద్రంలోని పీహెచ్​సీకి రూ.10 లక్షలు వెచ్చించి అంబులెన్స్​ను అందించారు. ఎంపీపీ దాతృత్వానికి మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతన వాహనాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం కొల్లాపూర్​లో క్రైస్తవ సోదరులకు క్రిస్​మస్​ కానుకలను ఆయన పంపీణీ చేశారు. అర్హులైన వారికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి యాస్మిన్​ భాష, జడ్పీ ఛైర్మన్​ లోకనాథ్​రెడ్డి, జడ్పీటీసీ వెంకటరమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే నూతన సాగు చట్టాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.