ETV Bharat / state

'ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి '

author img

By

Published : Aug 29, 2020, 7:57 PM IST

idstrict development meeting at wanaparthy collectorate
'ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి '

ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన ఉండాలని వనపర్తి కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి సూచించారు.

వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి హాజరయ్యారు. ప్రజాప్రతినిధులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన ఉండాలని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. అప్పుడే పథకాల అమలు, పనితీరుపై ప్రజలకు చెప్పే అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మూడు నెలలకోసారి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అందులో ప్రజాప్రతినిధులు అందరూ హాజరై ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో షేక్ యాస్మిన్ బాషా, జడ్పీ ఛైర్మన్ లోక్​నాథ్​రెడ్డి, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.