ETV Bharat / state

ఎమ్మార్వో ఆఫీసులో నిప్పంటించుకున్న రైతు

author img

By

Published : Oct 18, 2019, 9:43 AM IST

ఎమ్మార్వో ఆఫీసులో నిప్పంటించుకున్న రైతు

తనకు వంశపారంపర్యంగా వచ్చిన భూమిని... సర్వే చేయమని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకోలేదు. మనస్తాపానికి గురైన ఓ రైతు తహసీల్దార్ చాంబర్​లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు.

వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరులోని రైతు ఆంజనేయులు తల్లి పేర ఎకరా 26 గుంటల భూమి ఉంది. ఈ భూమిని సర్వే చేయాలంటూ ఆంజనేయులు కొద్ది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మనస్తాపం చెందిన ఆంజనేయులు తహసీల్దార్ కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు... మంటలను ఆర్పారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఎమ్మార్వో ఆఫీసులో నిప్పంటించుకున్న రైతు

ఇవీ చూడండి: 2018-19లో సత్య నాదెళ్ల వార్షిక సంపాదన రూ.300 కోట్లు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.