ETV Bharat / state

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్ యాస్మిన్​ భాషా

author img

By

Published : Aug 13, 2020, 10:21 PM IST

collector yasmin basha plants trees at wanaparthy krishnaveni sugar factory
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్ యాస్మిన్​ భాషా

ఆరో విడత హరితహారంలో భాగంగా వనపర్తి జిల్లా అప్పరాల సమీపంలో ఉన్న కృష్ణవేణి చక్కెర కర్మాగారంలో కలెక్టర్​ యాస్మిన్ భాషా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలని కలెక్టర్​ కోరారు.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల సమీపంలో ఉన్న కృష్ణవేణి చక్కెర కర్మాగారంలో హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ షేక్​ యాస్మిన్​ భాషా, అదనపు కలెక్టర్ శ్రీ వాత్సవా కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని కలెక్టర్​ కోరారు.

ఇప్పుడు మొక్కలు నాటితే రేపటి తరానికి కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించినవారం అవుతామని.. కాబట్టి ప్రజలందరూ తమ ఇళ్లల్లో మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మౌనిక, జడ్పీ వైస్​ ఛైర్మన్ వామన్​గౌడ్, ఎంపీడీవో శ్రీ వాత్సవ, తహసీల్దార్ రమేష్​ రెడ్డి, చక్కెర కంపెనీ డైరెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.