ETV Bharat / state

'నష్టాల నుంచి గట్టెక్కాలంటే విలీనం ఒక్కటే మార్గం'

author img

By

Published : Oct 17, 2019, 3:28 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019

సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రజాప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆర్టీసీ సంస్థను కేసీఆర్ ప్రభుత్వమే అప్పులపాలు చేసిందని విమర్శించారు.​

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019

నష్టాల నుంచి ఆర్టీసీ బయటపడాలంటే విలీనం ఒక్కటే మార్గం అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ... జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. సమ్మె నోటీసులు ఇచ్చి రెండు నెలలు ఎదురు చూసినా.. ప్రభుత్వం స్పందించకుండాఅహంకార పూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఏకపక్ష నిర్ణయాలతో మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా గుణపాఠం చెప్పాలన్నారు. సమ్మెపై చర్చలు జరపాలని హైకోర్టు సూచించినా.. ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు.

Slug : TG_NLG_21_17_KODHANDARAM_RTC_SAMME_AB_TS10066 రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ, సూర్యాపేట. ( ) ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య కోదండ రామ్ డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఆర్టీసీ ఇరుసులాంటిదని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు పనిచేస్తున్న ఆర్టీసీ సంస్థను ప్రభుత్వమే అప్పులపాలు చేసిందని విమర్శించారు. వాయిస్ ఓవర్ : తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఇరు వర్గాలు సమస్యను చర్చల పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినా.. ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని విమర్శించారు. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ... సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపోముందు సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భాగా మాట్లాడిన కోదండరామ్ ప్రభుత్వమే 2 వేల కోట్ల బకాయిలు చెలంచకుండా ఆర్టీసీ ని నష్టాల్లోకి నెట్టిందని అన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తూ... ఆనిందను కార్మికులపై వేస్తుందని వెల్లడించారు. క్రమశిక్షణ కలిగిన ఆర్టీసీ సంస్థలో టైర్ల కొనుగోలు వంటి అక్రమాలు ఉన్నత స్థాయి అధికారుల కుమ్మక్కుతోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల పరిష్కారానికి విలీనం ఒక్కటే మార్గం అని తేల్చి చెప్పారు కోదండరాం. విలీనం కంటే ఏమన్నా మార్గం ఉంటే ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా అప్పులు చేసిన ప్రభుత్వం ఆర్టీసీనిని నష్టాల పాలు చేసిందన్నారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రే కారణమని అన్నారు. జూన్ మాసం నుంచి చర్చలకోడం యూనియన్లు ఎదురు చూశాయని అన్నారు. సమ్మె నోటీసులు ఇచ్చి రెండు నెలలుగా ఎదురు చూసిన ప్రభుత్వం చర్చలు జరపకుండా అహాంకార పూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఏకపక్ష నిర్ణయాలతో మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి కనువుప్పు కలిగేలా గుణపాఠం చెప్పసలని కాంశిస్తూ.. మొత్తం తెలంగాణ సమాజం సమ్మె వైపే ఎదురు చూస్తుందని కోదండ రామ్ అన్నారు. ఆయా వర్గాల వారిగా ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు...బైట్ 1. కోదండ రామ్ , తెలంగాణ జన సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.