ETV Bharat / state

parents complaint: 'మా కొడుకులు మా భూములు లాక్కొని.. మమ్మల్ని పట్టించుకోవడం లేదు'

author img

By

Published : Apr 15, 2023, 5:31 PM IST

parents complaints on his son
'మా కొడుకులు మా భూములు లాక్కొని.. మమ్మల్ని పట్టించుకోవడం లేదు'

parents complaints on his son: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కన్న కొడుకులు రోడ్డున వదిలేశారు. వారి పేరున ఉన్న భూమిని అన్యాయంగా పట్టా చేయించుకుని.. ఏంటిది అని అడిగినందుకు ఇబ్బంది పెడుతున్నారు. తొమ్మిది పదుల వయస్సున్న మాకు అన్నం పెట్టే దిక్కులేదని మా భూమి మాకు కావాలని ఆ వృద్ధ దంపతులు వాపోతున్నారు.

parents complaints on his son: కనిపెంచిన తల్లిదండ్రులను పోషించడాన్ని నేటి రోజుల్లో భారంగా ఫీలవుతున్నారు. వారికి బుక్కెడు అన్నం పెట్టడానికి మనసు రాక వీధిన పడేస్తున్నారు. కన్న తల్లిదండ్రులని చూడకుండా ఆస్తి, పాస్తులని లెక్కలేసుకుని గిరిగీసుకుని బతుకుతున్నారు. కన్నవారికి కొంచెం అన్నం పెట్టలేక వంతులేసుకొని వారిని భారంగా సాకుతున్నారు. తల్లిదండ్రుల పేరు మీద ఆస్తులున్నంత వరకే వారికి విలువ ఇస్తున్నారు. ఏదో ఒక కాకమ్మ కథ చెప్పి వారి నుంచి ఆస్తి తీసేసుకుని చివరకు అక్కర్లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వృద్ధాప్యంలో ఒక్క పూట అన్నం కోసం చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. వారి గోడు ఎవరికీ విన్నవించుకోవాలో తెలియక తల్లిదండ్రులు కన్న కష్టాలు పడుతున్నారు. అలాంటి సంఘటనే సూర్యాపేటలో జరిగింది.

వృద్ధ దంపతులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండల కేంద్రానికి చెందిన గురువోజు గోపయ్య(90), సోమక్క (88) అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్దకుమారుడు ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నాడు. చిన్నకుమారుడే గత 30 ఏళ్లుగా వీరి మంచి చెడు చూస్తున్నాడు. చివరి దశలో తల్లిదండ్రుల బాగోగులను చూడటం ఇబ్బందిగా ఉందని అతను పెద్దమనుషులను ఆశ్రయించాడు. తల్లిదండ్రుల పేరిట ఉన్న 2.33 ఎకరాల భూమిని తన పేరిట పట్టాచేస్తే తాను చూసుకుంటానని పెద్దకుమారుడు సోమాచారి పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు.

అతడిని నమ్మిన సోమక్క, గోపయ్య దంపతులు 2019లో పెద్దకుమారుడి కొడుకు పేరు మీద పట్టా చేశారు. ఇదే అదునుగా భావించిన మనువడు సొంత అవసరాల నిమిత్తం తన భార్యకు అమ్మినట్లుగా 2020లో రిజిస్ట్రేషన్ చేయించాడు. విషయం తెలుసుకొని నిలదీయడంతో పట్టించుకోకుండా బెదిరిస్తూ తమపై దాడికి పాల్పడుతున్నారని వారు వాపోయారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని.. తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా పాలనాధికారి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశామని చెప్పారు. అయితే దీనిపై పెద్ద కుమారుడు సోమాచారి వివరణ ఇచ్చాడు. 'కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు ఎలాంటి ఆస్తులు ఇచ్చినా, ఇవ్వకున్నా వారిని సాకుతా. అనారోగ్యం పాలైతే ఆసుపత్రుల్లో చేర్పించి బిల్లులు చెల్లించి నయం చేయించాను. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదని పెద్దకుమారుడు సోమాచారి ' తెలిపారు.

"మా భూమిని లాక్కొని మమ్మల్ని బయటకు గెంటేశారు. మాకు అన్నం పెట్టడం లేదు. ఒక కొడుకు చూసుకోవడం లేదని ఇంకో దగ్గరకు వస్తే 2 ఎకరాల భూమిని తీసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరు చూసుకోవడం లేదు. మమ్మల్ని అనాథల్లా వదిలేశారు. మాకు ఆరోగ్యం బాగుండటం లేదు. మా భూమి మాకు కావాలి."_వృద్ధ దంపతులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.