కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు ఎమ్మెల్యే వేధింపులు

author img

By

Published : Aug 16, 2022, 8:02 AM IST

Allegations on Kodad MLA Bollam Mallaiah Yadav

Allegations on Kodad MLA Bollam Mallaiah Yadav స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా అధికార తెరాసలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈసారి సూర్యాపేట జిల్లాలో ఈ వివాదం భగ్గుమంది. స్థానిక ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్ తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని.. ప్రొటోకాల్స్ పాటించకుండా తనని అవమానిస్తున్నారని.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మీడియా ముందు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తన గోడు వెల్లబోసుకున్నారు.

Allegations on Kodad MLA Bollam Mallaiah Yadav స్వాతంత్య్ర దిన వేడుకల సాక్షిగా కోదాడ అధికార పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ తన కుటుంబాన్ని మానసికంగా వేధించడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోదాడ పుర ఛైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష ఆరోపించారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో పట్టణ ప్రథమ పౌరురాలిగా గుర్తింపు ఇవ్వకుండా కోదాడ ఎంపీపీ, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌తో అవమానపర్చారని ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోరున విలపించారు.

ఎమ్మెల్యే పుర పాలక వర్గంలో చీలికలు తెచ్చి, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని మున్సిపల్ ఛైర్‌పర్సన్ శిరీష ఆరోపించారు. అధికార, పార్టీ కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా తమను దూరంగా పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వివరించారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన నాకు భర్త తోడుగా వస్తుంటే అడ్డుకోవడం బాధాకరమన్నారు. ‘‘అన్నా మల్లన్నా నీ సోదరిగా వేడుకుంటున్నా నా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయకన్నా’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్లు సుశీల, మాదార్, స్వామి నాయక్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Allegations on MLA Bollam Mallaiah Yadav వివాదానికి కారణమిదే ఉదయం మున్సిపల్‌ కార్యాలయంలో జెండా ఎగురవేయటానికి ఛైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ వాసులు హాజరయ్యారు. ఉదయం 8:30 గంటలకు జెండా ఆవిష్కరించేందుకు పుర ఛైర్‌ పర్సన్‌ సమాయత్తమవుతున్న సమయంలో ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగాలని పుర కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ లోపు ఎమ్మెల్యే మున్సిపల్‌ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిపోయారు. దారిలోని మున్సిపల్‌ కార్యాలయానికి రాకపోవడంతో అక్కడున్న వారికి కమిషనర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. కమిషనర్‌ వ్యవహారశైలిపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. సమయం దాటినా ఎమ్మెల్యే రాలేదంటూ ఛైర్‌పర్సన్‌ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ఆమె అక్కడి నుంచి గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి వెళ్లారు.

ఈ సమయంలో ఎమ్మెల్యే, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ బుర్ర సుధారాణి, కోదాడ ఎంపీపీ కవితారెడ్డి అక్కడి వచ్చారు. వారు లోపలికి వస్తున్న క్రమంలో తనను పక్కకు తోసేసి అవమానించారని పుర ఛైర్‌పర్సన్‌ శిరీష ఆరోపించారు. పట్టణ ప్రథమ పౌరురాలి హోదాలో కార్యక్రమానికి హాజరైతే మండలానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు అవమానకరంగా వ్యవహరించారని విమర్శించారు. మనస్తాపంతో అక్కడి నుంచి గాంధీ విగ్రహం ఎదుట మౌనంగా నిరసన వ్యక్తం చేసి.. ఇంటికి వెళ్లిపోయింది. ఈ వ్యవహారంపై ఎంపీపీ కవితారెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ సుధారాణి మాట్లాడుతూ ఆమె మాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఛైర్‌పర్సన్‌ ముందుండాలంటూ మమ్మల్నే నెట్టుకుంటూ ముందుకు వెళ్లిందన్నారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.