ETV Bharat / state

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్​ చేయాలంటూ ధర్నా

author img

By

Published : Oct 19, 2020, 2:40 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లిలోని తెలంగాణ జెన్​కో వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్​ చేయాలంటూ ఆందోళనకు దిగారు.

genco contract workers protest at pulichintala project
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్​ చేయాలంటూ ధర్నా

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టు దగ్గర కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జెన్​కో వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పనిచేసిన తమకు తగిన గుర్తింపు లభించాలని వారు డిమాండ్​ చేశారు.

గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు జెన్​కో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న తమను ఈ నెల 15 నుంచి విధుల్లోకి తీసుకోకుండా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకుని తక్షణమే పర్మినెంట్​ చేయాలని జెన్​కో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

ఇదీ చూడండి: మీర్​పేట్​లో జలపాతాన్ని తలపిస్తోన్న ఓ ఇల్లు.. ఇదిగో వీడియో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.