DK ARUNA: ''జన ఆశీర్వాద యాత్ర'కు భారీ స్పందన'

author img

By

Published : Aug 19, 2021, 7:16 PM IST

DK ARUNA: ''జన ఆశీర్వాద యాత్ర'కు భారీ స్పందన'

తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమన్నారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తలపెట్టిన జన ఆశీర్వాద యాత్రకు భారీ స్పందన రాబోతుందని స్పష్టం చేశారు.

కేంద్రమంత్రి కిషన్​రెడ్డి జన ఆశీర్వాద యాత్రను పురస్కరించుకుని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. స్థానిక మఠంపల్లి క్రాస్ రోడ్​ నుంచి ఇందిరాచౌక్ వరకు చేపట్టిన ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కోదాడకు భారీ ర్యాలీగా బయలుదేరిన డీకే అరుణ
కోదాడకు భారీ ర్యాలీగా బయలుదేరిన డీకే అరుణ

ఈ సందర్భంగా తెరాస పార్టీకి భాజపానే ప్రత్యామ్నాయమని డీకే అరుణ పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుందన్నారు. ప్రజలంతా భాజపా వైపే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తలపెట్టిన జన ఆశీర్వాద యాత్రకు భారీ స్పందన రాబోతుందన్న అరుణ.. హుజూర్​నగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

రాష్ట్రంలో మూడు రోజుల పాటు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి జన ఆశీర్వాద సభ కొనసాగుతుంది. కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను కిషన్​రెడ్డి ప్రజలకు వివరిస్తారు. త్వరలోనే తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుంది. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెస్తాం. కిషన్​రెడ్డి యాత్రను ప్రజలు ఆశీర్వదించాలి. డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

అనంతరం హుజూర్​నగర్​ నుంచి కోదాడ జన ఆశీర్వాద సభకు భారీ ర్యాలీగా బయలుదేరారు. డీకే అరుణ వెంట ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ రోజు నుంచి 3 రోజులు సాగే యాత్రలో భాగంగా 20వ తేదీ ఉదయం దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా కిషన్​ రెడ్డి వరంగల్ చేరుకుంటారు. అక్కడ భద్రకాళీ మాత దర్శనం చేసుకుంటారు. వరంగల్​ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్​ను కిషన్‌ రెడ్డి సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండకు బయల్దేరి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించనున్నారు.

హన్మకొండ నుంచి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్లాషాపూర్​కు వెళ్లి సర్వాయి పాపన్న కోటను పరిశీలిస్తారు. అక్కడి నుంచి యాత్ర.. జనగామ మీదుగా ఆలేరుకు చేరుకుంటుంది. ఆలేరులో పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కళాకారులు చింతకింది మల్లేశంను కిషన్‌ రెడ్డి కలవనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనానంతరం రాత్రి అక్కడే బస చేయనున్నారు.

21న ముగింపు సభ..

21న ఉదయం భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కిషన్​ రెడ్డి రేషన్‌ దుకాణాలకు వెళ్లి పరిశీలిస్తారు. ఘట్​కేసర్​, ఉప్పల్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి ఆరోజు రాత్రి 7గంటలకు యాత్ర చేరుకుంటుంది. అక్కడ ముగింపు సభ నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: Kishan Reddy Injure: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తలకు స్వల్ప గాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.