ETV Bharat / state

టోకెన్లకోసం కార్యాలయాల వద్ద రోజుల తరబడి పడిగాపులు

author img

By

Published : Nov 13, 2020, 12:22 PM IST

సన్నరకం ధాన్యం అమ్ముకోవడానికి రైతులు బారులు తీరారు. టోకెన్ల కోసం కార్యాలయాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. టోకెన్లు ఉంటేనే మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తక్కువ ధరకు ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నామని చెబుతున్నారు.

days-of-stagnation-at-office-for-tokens-in-suryapet-district
టోకెన్లకోసం కార్యాలయాల వద్ద రోజుల తరబడి పడిగాపులు

సన్నరకం ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు. టోకెన్ ఉంటేనే సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తామని రైస్‌ మిల్లర్లు చెప్పడం వల్ల.. టోకెన్ల కోసం బారులు తీరుతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు.

గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో అధికారులు టోకెన్లు ఇస్తున్నందున అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. సన్నరకం వరి సాగు చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందని వాపోయారు. వేములపల్లిలో టోకెన్ల కోసం ఎంపీడీఓ కార్యాలయానికి రైతులు పోటెత్తారు. గత నాలుగు రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని అన్నదాతలు వాపోయారు.

టోకెన్లకోసం కార్యాలయాల వద్ద రోజుల తరబడి పడిగాపులు

ఇదీ చూడండి: కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.