ETV Bharat / state

దుబ్బాకలో అకాల వర్షం.. మార్కెట్​యార్డులో కొట్టుకుపోయిన ధాన్యం

author img

By

Published : May 5, 2021, 7:16 PM IST

rain effect on farmers in dubbaka market yard
దుబ్బాక మార్కెట్​ యార్డులో వర్షానికి తడిసి ముద్దయిన వరిధాన్యం

అకాల వర్షాలు అన్నదాతలను ముంచుతున్నాయి. కష్టపడి పండించిన ధాన్యాన్ని వర్షపు నీరు ముంచెత్తింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కురిసిన వర్షానికి మార్కెట్​ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. వరిధాన్యం నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రకృతి... రైతన్న మీద కన్నెర్రజేసింది. అకాల వర్షాలతో అన్నదాతను దెబ్బతీసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇవాళ కురిసిన భారీ వర్షానికి మార్కెట్​ యార్డులోని వరిధాన్యం తడిసి ముద్దయింది. రైతన్నల కళ్లముందే ధాన్యం నీటిపాలు కావడంతో లబోదిబోమంటున్నారు.

మార్కెట్ అధికారులు తమ ధాన్యాన్ని కొనడానికి కారణాలు చూపుతూ ఆలస్యం చేయడంతో వేచి చూడాల్సి వస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రోజుల తరబడి ఉంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూసి కర్షకులు కన్నీటి పర్యంతమయ్యారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రాధేయపడ్డారు. తక్షణమే ప్రభుత్వం తమకు సరైన గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

దుబ్బాక మార్కెట్​ యార్డులో కొట్టుకుపోయిన వరిధాన్యం

ఇదీ చూడండి: భవిష్యత్‌ కార్యచరణపై సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటా :ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.