ETV Bharat / state

'రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తే.. చెప్పకుండా తొలగించారు'

author img

By

Published : Jul 20, 2020, 5:36 PM IST

తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించారని సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలం కోమటిబండలో ఆందోళనకు దిగారు. ఈ పథకం కింద పనిచేసే 709 మంది కార్మికుల్లో 200 మంది ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు కోమటిబండలోని భగీరథ పంపుహౌస్ వద్ద వాటర్​ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

Mission Bhagiratha outsourcing labor protest at gajwel in siddipet district
గజ్వేల్​లో భగీరథ కార్మికుల నిరసన

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో మిషన్ భగీరథ పథకం కింద పనిచేసే 200 మంది ఒప్పంద కార్మికులు పంపుహౌస్​ వద్ద ఉన్న వాటర్​ట్యాంక్​ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమను విధుల్లో నుంచి అకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

పథకం ప్రారంభించినప్పటి నుంచి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి, మిషన్ భగీరథను దేశానికే ఆదర్శవంతమైన పథకంగా తీర్చిదిద్దిన తమను తొలగించండం అన్యాయమని వాపోయారు. కరోనా వంటి కష్టకాలంలో తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఒప్పంద కార్మికుల నిరసన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేసుకుని వారికి సర్దిచెప్పగా కార్మికులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.