ETV Bharat / state

హైదరాబాద్​ స్థాయిలో సిద్దిపేటలో వైద్య సదుపాయాలు: హరీశ్​ రావు

author img

By

Published : Feb 8, 2021, 10:16 PM IST

minster-harish-rao-participated-in-zp-meeting-in-siddipeta-district-today
జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి హరీశ్​రావు

రాజధాని స్థాయిలో అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి హరీశ్​ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్​లో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. వైద్యరంగంపై సీఎం కేసీఆర్​ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి పేర్కొన్నారు.

ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్​ రావు అన్నారు. హైదరాబాద్​ తర్వాత సిద్దిపేటలోనే రూ.2.5 కోట్లతో అత్యాధునిక డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు పూర్తి ఉచితంగా 57 రకాల ఆరోగ్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ చరవాణికే పంపుతామన్నారు. రాబోయే పక్షం రోజుల్లోనే సిద్దిపేటలో ఐసీయూ పడకలను 40కి పెంచుతామని మంత్రి తెలిపారు. త్వరలోనే అందరికీ సిటీ స్కాన్​ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

50 వేల ఎకరాల లక్ష్యం :

జిల్లాలో 50 వేల ఎకరాలలో పామాయిల్ సాగు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. పామాయిల్ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయంతో పాటు కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు. పామాయిల్ పంటకు చీడ పీడల బెడద, అటవీ జంతువుల బాధలు ఉండవన్నారు. పామాయిల్ పంట సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రభుత్వ రాయితీలు, అంతర పంటల సాగుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టు పురుగుల పెంపకాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ముందుకు వచ్చే ప్రజా ప్రతినిధులు, రైతులకు కర్ణాటక, ఖమ్మం జిల్లాలకు విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ రోజా శర్మ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్​, ఓడతెల సతీశ్​ కుమార్​, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి హరీశ్​రావు

ఇదీ చూడండి : మంథనిలో ఈటల.. ప్రొటోకాల్ పాటించలేదని శ్రీధర్ బాబు అలక..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.