ETV Bharat / state

Harishrao on 24 hours current : 'కాంగ్రెస్ మాటలు నమ్మి.. రైతన్నలు మోసపోవద్దు'

author img

By

Published : Jul 19, 2023, 3:00 PM IST

Updated : Jul 19, 2023, 4:27 PM IST

Harishrao Fires On Revanth Reddy
Harishrao Fires On Revanth Reddy

Harish Rao Comments on 24 Hours Current : చంద్రబాబు నాయుడు వారసుడు రేవంత్ రెడ్డి అని.. కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని మంత్రి హరీశ్​రావు సూచించారు. అన్నదాతకు 24 గంటలు కరెంట్ ఇచ్చి.. ఆదుకునేది బీఆర్​ఎస్ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ రైతు వేదికలో 24 గంటల కరెంట్, కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలపై నిర్వహించిన రైతు సమావేశానికి ఆయన హాజరయ్యారు.

Minister Harish Rao Fires on Congress : కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని.. 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు అండగా నిలిచేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమేనని మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారసుడని దుయ్యబట్టారు. సిద్దిపేట గ్రామీణ మండలం రాఘవాపూర్ రైతు వేదికలో 24 గంటల కరెంట్, కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలపై నిర్వహించిన రైతు సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్​ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు ఉండేవని హరీశ్​రావు ఎద్దేవా చేశారు. తెలివి లేని కాంగ్రెస్ నాయకులు.. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందంటున్నారని విమర్శించారు.

Harish Rao latest news : 3 గంటల కరెంట్ అందించే పార్టీ కావాలో.. 3 పంటలకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో రైతన్నలు ఆలోచించుకోవాలని మంత్రి సూచించారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు రైతుబంధు కింద 11 విడతల్లో రూ.72 వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందని తెలిపారు. 24 గంటల కరెంట్ కోసం ప్రతి సంవత్సరం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో.. ఎండా కాలంలోనూ స్థానిక పెద్ద చెరువు నిండుకుండలా ఉందన్నారు. ఒక్క రాఘవాపూర్ గ్రామంలోనే 40 మందికి రైతు బీమా అందించామన్న ఆయన.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1 లక్ష 6 వేల 74 మంది అన్నదాతల కుటుంబాలు రైతు బీమా ద్వారా లబ్ధి పొందాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గతంలో బతుకుదెరువు కోసం తెలంగాణ ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళితే.. నేడు ఇతర రాష్ట్రాల నుంచి వరి నాట్లు వేయడానికి కార్మికులు రాష్ట్రానికి వలస వచ్చే స్థితికి తెలంగాణ ఎదిగిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని.. ఈ విషయాన్ని ప్రతి రైతన్న ఆలోచించాలని కోరారు.

కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్​లు.. కాలిపోయే మోటార్లు ఉండేవి. కాంగ్రెస్‌ నాయకులు వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ చాలంటున్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా కోసం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎండాకాలంలోనూ స్థానిక పెద్ద చెరువు నిండుకుండలా ఉంది. రాఘవాపూర్ గ్రామంలో 40 మంది రైతులకు రైతు బీమా అందించాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1 లక్ష 6 వేల 74 మంది రైతుల కుటుంబాలు రైతు బీమా ద్వారా లబ్ధి పొందాయి. చంద్రబాబు నాయుడు వారసుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు. 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు అండగా నిలిచేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే. - హరీశ్​రావు, ఆర్థికమంత్రి

Harishrao on 24 hours current : 'కాంగ్రెస్ మాటలు నమ్మి.. రైతన్నలు మోసపోవద్దు'

ఇవీ చూడండి..

Harish Rao latest news : 'తెలంగాణ కాంగ్రెస్​.. పిచ్చోడి చేతిలో రాయిగా మారింది'

HarishRao Latest News : 'తెలంగాణతో కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం.. కానీ కాంగ్రెస్, బీజేపీది పేకమేడల బంధం'

Last Updated :Jul 19, 2023, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.