ETV Bharat / state

ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు

author img

By

Published : Jun 14, 2020, 12:53 PM IST

భూతగాదాల వల్ల తండ్రిని కొడుకే కొట్టి చంపిన ఘటన సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండల పరిధిలో చోటు చేసుకుంది. పొలం వద్దకు వెళ్లి వస్తున్న తండ్రిని మార్గమధ్యంలో కొడుకు అడ్డుకొని కర్రతో దాడి  చేసి.. కొట్టడం వల్ల తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

Father Murdered By son For With Land Disputes
ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకు

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోమ్లా నాయక్​ అతని కుమారుడు సమ్మయ్యకు కొన్ని రోజులుగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పొలం వద్దకు వెళ్లి వస్తున్న సోమ్లా నాయక్​ను కొడుకు సమ్మయ్య మార్గమధ్యంలో అడ్డుకొని భూమికి సంబంధించి అడిగాడు.

ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. సమ్మయ్య కోపంతో కర్ర తీసుకొని తండ్రి సోమ్లా నాయక్​ తల మీద బలంగా కొట్టాడు. తలకు బలంగా తగలడం వల్ల సోమ్లా నాయక్​ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం ఇద్దరి మధ్య భూ తగాదాలే కారణం అని తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: అకాల వర్షాలతో రైతన్న కష్టం నేలపాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.