ETV Bharat / state

దారుణం: గొంతుకోసి బ్యాంకు ఉద్యోగిని హత్య

author img

By

Published : Feb 18, 2020, 11:38 PM IST

గజ్వేల్​ పట్టణంలో బ్యాంకు ఉద్యోగిని దారుణంగా హత్యకు గురైంది. విధులు ముగించుకొని ఇంటికి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు.

brutly murdered bank employe in gajwel
గొంతుకోసి బ్యాంకు ఉద్యోగిని హత్య

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో దారుణం చోటుచేసుకుంది. ఏపీజీవీబీలో ఫీల్డ్ ఆఫీసర్​గా పనిచేస్తున్న దివ్య హత్యకు గురైంది. పట్టణంలోని లక్ష్మీప్రసన్న నగర్​ కాలనీలో అద్దెకు ఉంటున్న దివ్య... విధులు ముగించుకొని రాగానే గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలకంటి దివ్య... 2019లో సెప్టెంబరులో విధుల్లో చేరింది. తల్లిదండ్రులతో కలిసి స్థానికంగా నివాసం ఉంటోంది. ఈ నెల 26న దివ్య పెళ్లి ఉన్నందున... ఏర్పాట్ల కోసం తల్లిదండ్రులు స్వగ్రామానికి వెళ్లారు. ప్రేమ పేరుతో వెంకటేశ్​ అనే వ్యక్తి వెంటపడేవాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

గొంతుకోసి బ్యాంకు ఉద్యోగిని హత్య

ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.